వైఎస్ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుంటున్న వైఎస్ షర్మిల అందరికి సుపరిచితమే.అన్న ఏపీ సీఎం జగన్‌తో విభేదించిన షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.
వైఎస్ఆర్‌టీపీ తో కొత్త పార్టీని స్థాపించి కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపింది.అధికార పార్టీ టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తూ పలుమార్లు సభలు, సమావేశాలు పెట్టి విరుచుకుపడిన విషయం విధితమే.
తెలంగాణలో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.తెలంగాణ రైతులపై స్పందిస్తూ టీఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం కారణంగానే తెలంగాణలో ఏడేండ్లలో ఏడువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వంపై మండి పడ్డారు.ఇంతటితో ఆగకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభించింది.400 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టాలని యోచించింది.బుధవారం యాదాద్రి, భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం గోకారంచ వర్కట్‌పల్లి, సంగెం గ్రామాల్లో పాదయాత్ర సాగింది.అయితే గోకారం వరకు 300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేసుకుంది.ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసింది.

మొత్తంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని అభివార్ణించి తెలంగాణ ప్రజల మనసులు దోచేందుకు పడరాని పాట్లు పడుతోంది.ఎలాగైన తెలంగాణలో మళ్లీ రాజన్న రాజక్యం తీసుకురావాలనే తపనతో పార్టీ పెట్టి ప్రచారాలు ముమ్మరం చేస్తున్నారు.కాగా ప్రచారంలో భాగంగా షర్మిల ముద్దులు చూస్తుంటే నవ్వులు తెప్పిస్తోంది.
ఆమె మాటలు, తీరు, వ్యవహార శైలి చూస్తుంటే ఆశ్చర్యం వేయకమానదు.ఇక ముద్దుల విషయంలో అన్నకు తగ్గ చెల్లిగా పెరు తెచ్చుకుంటోంది.
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించి ఓటర్లకు నుదుటిపై ముద్దులు పెడుతూ వార్తల్లో నిలిచిన విషయం విధితమే.ఒకానొక దశలో ఓ ముసలవ్వకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించగా ఆ ముసలవ్వ జగన్కే ముద్దు పెట్టడం గతంలో వైరల్‌గా మారింది.
అయితే ఏపీలో జగన్ మాదిరిగా తెలంగాణలో ప్రజా ప్రస్థాన పాదయాత్ర పేరుతో షర్మిల చేపట్టిన పాదయాత్రపై ప్రజలు సెటైర్లు వేయడం గమనార్హం.ఇక నెట్టింటిలో అయితే కామెంట్ల జోరు నడుస్తోంది.
ఆంధ్రా ముద్దులు తెలంగాణకు షిఫ్ట్ అయ్యాయని కామెంట్ చేస్తున్నారు.తాజాగా వైఎస్ షర్మిల తన పాదయాత్రలో పర్యటిస్తుండగా ఓ పెద్దాయన నుదిటిపై ముద్దు పెడుతున్న ఫోటో నెట్టింటిలో తెగ వైరల్ అవుతోంది.
మరి ఈ ముద్దుల పంథా ప్రజా మనసులను ఏమేరకు దోచుకుంటుందో వేచి చూడాలి.







