దేశ ప్రధాని నరేంద్ర మోడీ విధించిన లాక్ డౌన్ గడువు రేపటితో ముగియబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లుగా ప్రకటించాయి.
అందులో తెంగాణ ఒకటి.ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయానుసారంగా నడుచుకుంటామంటూ ప్రకటించాడు.
ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకోబోతున్న నిర్ణయంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శనివారం లేదా ఆదివారం నాడు మోడీ మీడియా ముందుకు వచ్చి జాతిని ఉద్దేశించి మాట్లాడుతాడని అంతా అనుకున్నారు.
కాని అది జరగలేదు.
క్యాబినెట్ సమావేశం, ముఖ్యంత్రుల సమావేశంతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించిన మోడీ లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని వెళ్లడిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
కేసుల సంఖ్య వేలకు వెలు పెరుగుతున్న ఈ సమయంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే మరింత ప్రమాదం తప్పదంటూ నిపుణులు చెబుతున్నారు.ఇదే సమయంలో ఆర్థిక రంగం ఇప్పటికైనా దారిన పడాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
మరి ప్రధాని మోడీ ఏం చేస్తాడు ఆయన ప్రకటన ఏంటీ అనేది దేశ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.