అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం( AP Assembly Speaker Tammineni Sitaram ) కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ, టీడీపీ గతంలో పిటిషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే.దీంతో పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు( MLAs Disqualification ) వేశారు.
కాగా వైసీపీ ఫిర్యాదుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై అనర్హత వేటు పడింది.ఇటు టీడీపీ ఫిర్యాదుతో వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాల గిరి, వాసుపల్లి గణేశ్ పై స్పీకర్ తమ్మినేని అనర్హత వేటు వేశారు.
అయితే మరి కొద్ది రోజుల్లోనే వీరి పదవీ కాలం పూర్తి కానుంది.కాగా అనర్హత పిటిషన్లపై విచారణ హాజరు కావాలని రెబల్ ఎమ్మెల్యేలకు( Rebel MLAs ) స్పీకర్ పలుమార్లు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.వారు విచారణకు రాకపోవడంతో న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇందులో భాగంగానే టీడీపీ, వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.