చిన్న వయస్సులోనే తల్లీదండ్రులు మరణిస్తే పిల్లలకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.కసి, పట్టుదలతో కష్టపడితే సక్సెస్ సొంతమవుతుందని నిరుపేద యువకుడు అయిన మురళీ నాయక్( Murali Nayak ) ప్రూవ్ చేశారు.
పుట్టిన నెలకే తల్లీదండ్రులను కోల్పోయిన మురళి అమ్మమ్మ దగ్గర పెరిగాడు.ఆ తర్వాత ప్రభుత్వ హాస్టల్ లో చదివిన మురళి ఒకవైపు డ్రైవర్ గా ( Driver ) పని చేస్తున్న మరోవైపు కలలు కన్న లక్ష్యాన్ని సాధించాడు.
అన్నమయ్య జిల్లాలోని( Annamayya District ) దిగువగళ్లా తండాకు చెందిన మురళీ నాయక్ ను అమ్మమ్మ కూలి పనులు చేస్తూ పోషించింది.కేవీ పల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి వరకు చదివిన మురళీ నాయక్ పీలేరులోని ప్రభుత్వ పాఠశాలలో( Govt School ) 9, 10 పూర్తి చేశారు.
ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసిన మురళి ఎస్వీ ఆర్ట్స్ కాలేజ్ లో బీకాం కంప్యూటర్స్ చదవడం గమనార్హం.

బీకాం కంప్యూటర్స్ పూర్తైన తర్వాత డ్రైవర్ గా పని చేస్తూ ఎస్సై జాబ్( SI Job ) కోసం ప్రిపేర్ అయ్యారు.ఎస్సై పరీక్షలో భాగంగా 167.5 మార్కులు సాధించడం గమనార్హం.లక్ష్యాన్ని సాధించడానికి పేదరికం అడ్డు కాదని కష్టపడితే సక్సెస్ దక్కుతుందని మురళీ నాయక్ ప్రూవ్ చేశారు.ఈ సక్సెస్ తో తాను ఆగనని కెరీర్ పరంగా మరింత ఎదగడా నికి కృషి చేస్తానని మురళీ నాయక్ కామెంట్లు చేశారు.

బలమైన పట్టుదలతో ముందుకు సాగితే సరైన సక్సెస్( Success ) దక్కుతుందని మురళి వెల్లడించారు.మురళికి రాబోయే రోజుల్లో మరింత విజయం దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మురళి టాలెంట్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.ఎన్ని కష్టాలు ఎదురైనా సక్సెస్ ను సొంతం చేసుకున్న మురళి ప్రశంసలు అందుకుంటున్నారు.పేదింటి బిడ్డ మురళీ నాయక్ ఎంతోమందికి స్పూర్తిగా నిలిచి కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.







