డాక్టర్ యన్.టి.
ఆర్ హెల్త్ యూనివర్సిటీ కి ఎప్పటినుంచో ఉన్న పేరు తొలగించి వై.యస్.ఆర్ పేరు పెట్టడం,ఆగమేఘాల మీద బిల్లు పాస్ చేయడం చూస్తుంటే ప్రభుత్వం కావాలనే పేరు మార్చింది అనిపిస్తోంది.యన్.టి.ఆర్., వై.యస్.ఆర్ ఇద్దరూ మహనాయకులే అందులో సందేహమే లేదు.కాకపోతే యన్.
టి.ఆర్ కు ఉన్న చరిష్మా వై.యస్.ఆర్ కు లేదు.ఏమి ఆలోచించి ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారో అర్ధం కావడం లేదు.సభ్యులను ఎవరిని సంప్రదించినట్లు లేదు.ఇది ముఖ్యమంత్రి వ్యక్తిగత నిర్ణయం లాగా ఉంది.పేరు మార్చడం పాలక వర్గం లోనే కొందరికి,కాదు కాదు చాలా మందికి నచ్చలేదు.
కేవలం ముఖ్యమంత్రి కి భజన చేసే వాల్లే ,పేరు మార్చడం అయిష్టంగా ఉన్న,లోలోపల ఇష్టపడుతున్నారు.బాహాటంగా యార్ల గడ్డ గారు రాజీనామా చేసి పేరు మార్చడం నన్ను బాధించింది అని చెప్పడం గమనార్హం.
ఈ విషయంలో లక్ష్మీ పార్వతి యన్.టి.ఆర్ కి అనుకూలంగా మాట్లాడక పోవడం విడ్డురం.ఆమెకు లోపల చెప్పలేని బాధ ఉన్న పైకి అలా చెబుతుంది అంటే చంద్రబాబు నాయుడుని చూసే.
యన్.టి.ఆర్ ను ఏమైన అంటే అంత ఎత్తు లేచే లక్ష్మీ పార్వతి ఎంతో ఉదాత్తమైన, అందరికి సుపరిచయం అయిన యన్.టి.ఆర్.పేరు తొలగించడం బాధాకరం.ఇది అనాలోచితమైన, మూర్ఖమైన చర్య, కేవలం కక్ష సాధింపే.ఆయన అంటే మాకు ఎనలేని గౌరవం ఉంది అంటున్నప్పుడు పేరు ఎందుకు మార్చాలి.జిల్లా కు యన్.టి.ఆర్ పేరు పెట్టి ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడం లాగా ఉంది.అనవసరంగా ముఖ్యమంత్రి ఒక తేనె తుట్టెను కదిపినట్లు అయింది.
పరిపాలన పై, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టక ఇటువంటి అసంబద్ధ నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారు ?.ఈ విషయంలో లక్ష్మీ పార్వతి చాలా ఆలస్యంగా స్పందించారు.

ఏమైనా అంటే వెన్ను పోటు పొడిచారు అంటారు.ఈ మాట ఇప్పుడు పాలక పక్షం వాళ్ళు కూడా అంటున్నారు.నిజంగా ఇప్పుడు పేరు మార్చి యన్.టి.ఆర్ గారికి వెన్ను పోటు పొడిచారు.నిజానికి చంద్రబాబు వెన్ను పోటు కాదు.
అప్పటి పరిస్థితుల్లో రాజకీయ పరిణామాల దృష్యా అనేక మంది సలహాలపై పార్టీ సంరక్షణకు నిర్ణయం తీసుకున్నారు.లేకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరోలా ఉండేది.

ఇందులో యన్.టి.ఆర్.కుటుంబ సభ్యులను లాగడం,రక రకాలుగా కొందరు పిచ్చి ,పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారు.అప్పుడు పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా చంద్రబాబు అలా చేయాల్సి వచ్చింది.ఇందులో తప్పేమిటి? ప్రతి కుటుంబానికి కొన్ని కారణాలు ఉంటాయి.అవన్నీ ఇప్పుడు చర్చించడం ఎందుకు ? పేరు మార్పు పై స్పందించమంటే కుటుంబ నేపథ్యం తీసుకు వస్తున్నారు.

మరో విషయం పాలక పక్షం వారు మీరు అధికారం లో ఉన్నప్పుడు ఎందుకు జిల్లాకు యన్.టి.ఆర్.గారి పెట్టలేదని వితండవాదం చేస్తుంటారు.అప్పటి ప్రభుత్వం వై.యస్.గారి పేరు ఎక్కడా తొలగించలేదు.అనవసరంగా మహనాయకులను ఇద్దరిని బజారుకు ఈడ్చారు.అత్యధికులు పేరు మార్చడం సమంజసంగా లేదు అంటున్నారు.ముఖ్యమంత్రి చెల్లెలే స్వయంగా ఈ విషయం అన్నారు.పేరు అయితే మార్చారు కానీ అది అమలులోకి రావాలంటే చాలా సమయం పడుతుంది.
ఎంతో వ్యయ,ప్రయాసలు ఉంటాయి.విద్యార్థుల పత్రాలు,వాటిపై ఫోటో, ఇంకా ఎన్నో సవరించాలి ఇదొక తలనొప్పి వ్యవహారం.
రేపు అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ పేరు మారిస్తే అంతా గందరగోళం గా మారుతుంది.