వైకాపా పాలనతో ప్రజలు విసిగిపోయారు : చంద్రబాబు

గుర్తింపు కోసమో లేక పదవీకాంక్షతోనో తాను అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనని, రాష్ట్ర అభివృద్ధి తన ప్రదమ ప్రదాన్యత గా చెప్పుకొచ్చారు తెలుగుదేశం అదినేత చంద్రబాబు( Chandra babu naidu ) .రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అనేక కట్టడాలను, ప్రాజెక్టులను తాను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకునే చేస్తానని ప్రజలు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా తాను ప్రజాభివృద్ధికి నిరంతరం పాటు పడతానని ఆయన చెప్పుకొచ్చారు.

 Ap People Tired With Ycp Goverment , Ycp Goverment , Ap Politics , Chandra Babu-TeluguStop.com

సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కునే మనస్తత్వం తనదని హుదూద్ సమయంలో ప్రధానమంత్రి స్వయంగా పర్యటించినప్పుడు ప్రజలు ఆవేశంతో ఉంటారని ఆయన భావించినప్పటికీ తమ ప్రభుత్వ మీద నమ్మకంతో ప్రజలు మోడీకి ఆహ్వానం పలికారని ఆయన గుర్తు చేశారు.

Telugu Ap, Chandra Babu, Tealangana, Ycp, Ys Jagan-Telugu Political News

వచ్చే ఎన్నికలలో వైసీపీ( YCP ) మరోసారి గెలిస్తే ఇంట్లో ఉన్న చిన్న వృద్ధులతో సహా తాము వేరే రాష్ట్రాలకు వలస వెళ్లిపోతామంటూ అనేకమంది నాతో చెబుతున్నారని రాష్ట్రాన్ని ఈ స్థాయిలోఅదో గతి పాలు చేసారంటూ ఆయన విమర్శలు చేశారు .రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలిగేది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.సంపదను సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామే తప్ప రాష్ట్రాన్ని అప్పులు పాలు కానివ్వమని అని చెప్పుకొచ్చారు.

Telugu Ap, Chandra Babu, Tealangana, Ycp, Ys Jagan-Telugu Political News

వైకాపా పాలన పై ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితుల్లో ఉన్నారని ఈ ప్రభుత్వం అన్ని రకాల గానూ బరితెగించినట్లుగా కనబడుతుంది అని వ్యాఖ్యానించారు ..కాలేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ సస్యశ్యామల మైనట్టే, పోలవరం ప్రాజెక్టు( Polavaram )తో కూడా ఆంధ్ర ప్రజల సాగునీటి అవసరాలు తీరతాయాన్ని తాను భావించానని, అయితే ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా దానిని ఒక సాధారణ బ్యారేజ్ లో మార్చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేస్తారని వ్యక్తిగత స్వలాభం కోసం అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆయన వైసిపి నాయకులు పై విమర్శలు చేశారు.ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల దాడి ని ఆంధ్ర అధికారపక్షం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube