ప్రజల అధికారమిస్తే హత్యలు చేయడానికి ఉపయోగించారని ఎంపీ అవినాష్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.కడప పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలో బస్సు యాత్ర నిర్వహించారు.
హత్య చేసిన అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తూ దానికి ఎమ్మెల్యే రఘురాం రెడ్డి తెగ బాధ పడిపోతున్నారు అన్నారు.
ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడైనా కనిపించారా ఎవరికైనా సాయం చేశారా అంటూ విమర్శించారు.
మేము అవినాష్ రెడ్డి పైన నిరాహార ఆరోపణలు చేయలేదని సిపిఐ చెప్పిన ఆధారాలతోనే మేము మాట్లాడుతున్నామన్నారు.