తిరుమల శ్రీవారిని ఏపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు.ఈ ఉదయం ఏపీ గ్రామ సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడటం, సంక్షేమ పథకాల అభివృద్ధిని ప్రతిపక్షాలు ఓర్వ లేక పోతున్నాయి అన్నారు.ఒంటిమిట్టలో శ్రీరాముని ఆలయాన్ని నిర్మించిన ఆది జాంబవంతునికి అక్కడ ఆలయం లేకపోవడం దురదృష్టకరం అన్నారు.
వీలైనంత త్వరలో అక్కడ జాంబవంతుని ఆలయాన్ని స్థాపించాలి అని టిటిడి పాలకమండలిని విజ్ఞప్తి చేశామన్నారు.







