ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఇంట విషాదం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాసరావు తండ్రి వెల్లంపల్లి సూర్యనారాయణ.ఈ రోజు ఉదయం మరణించారు.

విశాఖపట్టణంలో ఉన్న స్వగృహం బ్రాహ్మణ వీధిలో.సొంత ఇంటిలోనే మృతి చెందడం జరిగింది.

మంత్రి ఇంటిలో విషాద ఘటన చోటు చేసుకోవడంతో ఏపీ మంత్రులు .సంతాపం వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం కృష్ణదాస్  నివాళులర్పించారు.

వెల్లంపల్లి సూర్యనారాయణ వయసు 80 కావడంతోపాటు.అనారోగ్యంగా ఉండటంతో .స్వగృహంలోనే చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు.ఇదిలా ఉంటే తండ్రి అంత్యక్రియలు విజయవాడ భవానీ పురం పున్న‌మీఘాట్ హిందూ శ్మ‌శాన‌వాటికలో నిర్వహించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిసైడ్ అయ్యారు.

Advertisement

  ఈ విషాద ఘటన పట్ల ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు.విజయవాడ ప్రాంతానికి చెందిన నాయకులు.వెల్లంపల్లి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నారు.

  .

Advertisement

తాజా వార్తలు