మీడియాలో తరచూ వినిపించే పేరు ఏపీ మంత్రి పేర్ని నాని. ఆయన తిట్లపురాణం మొదలు పెడితే ఇక అడ్డూ అదుపు ఉండదనడంలో అతిశయోక్తి లేదు.
ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ నోరు తెరిచి ఏదైనా మాట్లాడితే చాలు.ఇదే అదునుగా పేర్ని నాని విరుచుకుపడుతుండడం మనం చూసిందే.
ఇతర వారి కంటే పవన్ అంటేనే తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించడం ఆయన తీరుకు అద్దం పడుతుంది.తాజాగా జనసేనాని పవన్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని తీవ్రంగా మండిపడ్డారు.
జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ఆయన మీడియాతో మాట్లాడారు.దీనికి కౌంటర్ ఇచ్చేందుకు పేర్నినాని వెంటనే మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు.
పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఇదే ఇప్పుడు చర్చణీయాంశంగా మారింది.
పవన్ కళ్యాణ్‌కు జీవితాన్ని ప్రసాదించిన సొంత అన్న చిరంజీవినే ఆయన మర్చిపోయారంటూ లాజిక్ లేని విమర్శ చేసి పేర్నినాని దొరికిపోయారు.ఎందుకంటే బహిరంగ సభలో రాజకీయ పార్టీల అధినేతలకు భిన్నంగా దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే పార్టీలు, అధినేతలకు పవన్ నమస్కారం పెట్టారు.
చిరంజీవికి మాత్రం నమస్కారం పెట్టలేదని పేర్ని నాని వాదన.అయితే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండడం.వేరే పార్టీలో లేకపోవడం ఇందుకు కారణాలు.

సో చిరంజీవికి గానీ, వారి కుటుంబీకులకు గాని నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు.ఈ లాజిక్ తెలియకుండా పేర్ని నాని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.అయితే వైసీపీకి కూడా నమస్కారం పెట్టి పవన్ ప్రసంగం ప్రారంభించారు.
అయితే పవన్ రాజకీయాల్లో చిరంజీవిని జొప్పించి తాను హైలెట్ అవ్వాలనుకుంటున్న పేర్ని నాని చేసే వ్యాఖ్యలు తనకు మైనస్ అని గ్రహించకపోవడం గమనార్హం.
జనసేన పార్టీ పెట్టిందే ప్రశ్నించడం కోసమన్న పవన్ 2014-2019 వరకు ఎందుకు ప్రశ్నించలేదని పేర్ని నాని వ్యాఖ్యానించారు.
మరి ఆ కాలంలో పేర్ని నాని లేడా అనే సందేహం కలుగక మానదు.

నాడు టీడీపీ పై గళం విప్పడం లాంటివి చేశారు.నాడు జనసేన గుర్తుకు రాలేదా ? అనే ప్రశ్న తలెత్తక మానదు.ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకూడదన్న భావన పవన్‌కు ఇప్పడు ఎందుకు కలిగిందో చెప్పాలని కోరారు.
ఇవి వింటే అసలు పేర్ని నానికి ఏపీలో ఎలాంటి పరిస్థితి ఉంది ? పవన్ వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం అంటుంటే పేర్ని నాని అర్థం లేని ప్రశ్నలు వేయడం చమత్కారంగా మారుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.







