జనసేన, వైసీపీ పార్టీల మధ్య రోజు రోజుకి మాటల యుద్ధం ముదిరిపోతోంది.ఒకరిమీద మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటూ రెండు పార్టీల మధ్య మరింత వైరం పెంచుకుంటున్నారు.
కొద్ది రోజులుగా రాయలసీమ జిల్లాల్లో పర్యటిస్తున్న పవన్ వైసీపీని టార్గెట్ గా చేసుకుంటూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఆ విమర్శలకు ప్రతి విమర్శలు అన్నట్టుగా ఇప్పడు వైసీపీ మంత్రులు కూడా పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను పవన్ కళ్యాణ్ పొగడడం పై మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు.జనసేనాని బీజేపీలో కలపాల్సిందిగా అమిత్ షా సూచించి ఉంటారని, అందుకే అమిత్ షా కరెక్ట్ అని పవన్ అంటున్నాడని నాని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు దగ్గర నుంచి తీసుకున్న రెమ్యునరేషన్ కు న్యాయం చేసేందుకు పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, సినిమాల్లో నిర్మాతకు పవన్ కల్యాణ్ కాల్షీట్లు ఇస్తే రాజకీయాల్లో మాత్రం చంద్రబాబుకి కాల్షీట్లు ఇచ్చారంటూ నాని వెటకారం చేశారు.నీకు రెమ్యూనరేషన్ ఇచ్చి, కాల్ షీట్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని మాత్రమే నువ్వు పొగుడుతామంటూ నాని మండిపడ్డారు.
పవన్ నాయుడు మమ్మల్ని ప్రజలు గుర్తించాలని మేమేమి ఏడ్వడంలేదని, ప్రజలు మమ్మల్ని గుర్తించారు, మిమ్మల్నే గుర్తించలేదు అంటూ నాని విమర్శలు చేసారు.