Rajdhani Files : రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టు స్టే..!!

ఏపీలో రాజకీయాలు సినిమాల చుట్టూ తిరుగుతున్నాయి.

దివంగత వైఎస్ఆర్, వైఎస్ జగన్ ( YSR, YS Jagan )జీవితం ఆధారంగా రూపొందించిన యాత్ర -2 సినిమా ఎటువంటి ఆటంకాలు లేకుండా థియేటర్లలోకి రాగా.

వ్యూహం సినిమాలో కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయి.న్యాయస్థానాల్లో విచారణ అనంతరం ఆ సినిమా ఈనెల 23న విడుదలకు సిద్ధమైంది.

తాజాగా రాజధాని ఫైల్స్ ( Rajdhani Files )అనే సినిమాపై ఏపీ హైకోర్టు ( AP High Court )స్టే ఇచ్చింది.వైసీపీ ప్రభుత్వంపై సెటైరిక్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది.దీంతో సినిమాను ఆపేయాలంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ( Secretary Lella Appireddy ) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీఎం జగన్, కొడాలి నాని పోలిన పాత్రలు ఉన్నాయని ఈ క్రమంలో సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ ను రద్దు చేయాలని లేళ్ల అప్పిరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement
తెలివితేటల్లో ఐన్‌స్టీన్‌నే మించిపోయిన భారత సంతతి బాలుడు.. వయసు పదేళ్లే!

తాజా వార్తలు