వైసీపీ ( YCP )అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామపంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చి సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే .పరిపాలన సంబంధిత నిర్ణయాలన్నీ సచివాలయం ద్వారానే పూర్తిచేస్తూ పంచాయతీ నిధులను వేర్వేరు పథకాలకు మల్లిస్తూ పంచాయతీరాజ్ వ్యవస్థను( Panchayati Raj system ) ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానికి దక్కుతుంది అని ప్రతిపక్షాలు నిత్యం విమర్శిస్తుంటాయి….
కనీసం పంచాయతీ నిదులతో చిన్న చిన్న రోడ్లు వేసుకోవాలన్నా , వీది లైట్లు మార్చుకోవాలన్నా కూడా నిధులు లేవంటే అతిశయోక్తి కాదని కొంత మంది సర్పంచులు వాపోతున్నారు .సొంత డబ్బులతో రోడ్లు వేసి ఆ బిల్లులు చెల్లింపు ఇప్పటికీ జరగక రోడ్లెక్కి ఒకపక్క సర్పంచులు నినాదాలు చేస్తుంటే ప్రభుత్వం ఇప్పుడు పంచాయతీలకు పురస్కారాలు ప్రకటించడం కొసమెరుపు .
ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని( National Panchayat Raj Day ) పురస్కరించుకొని 24 గ్రామపంచాయతీలను రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపిక చేసింది రాష్ట్ర ప్రభుత్వం .పేదరిక నిర్మూలన ,, పెండ్లి పంచాయతీ , క్లీన్ అండ్ గ్రీన్ ఇలా రకరకాల కేటగిరీల్లో పురస్కారాలు ప్రకటించి 24 పంచాయతీలకు అవార్డులు ప్రకటించారు .దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి .

అసలు పంచాయతీలను నాశనం చేసిందే అధికార పార్టీ అయినప్పుడు మళ్ళీ దానికి అవార్డులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు .సొంత పార్టీ సర్పంచులు కూడా వైసీపీ ప్రభుత్వం మీద గొంతు ఎత్తిన కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం నిద్ర నటిస్తుందని దీనికి చరమగీతం పాడే రోజు తొందరలోనే ఉందంటూ తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు ….

.ఏది ఏమైనా సమర్థవంతమైన పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో వాడుకోవడంలో మాత్రం జగన్ ప్రభుత్వం( Jagan Govt ) విఫలమైందనే చెప్పాలి .ఒక అద్భుతమైన వ్యవస్థను ఇలా నీరుగార్చడం ప్రజాస్వామ్యంలో హర్షణీయం.కాదు.గ్రామ స్వరాజ్యానికి అసలైన అర్థం చెప్పే పంచాయతీరాజ్ వ్యవస్థను నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది.ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో పంచాయతీరాజ్ వ్యవస్థను నిలబెట్టి గ్రామాభివృద్ధికి ఊతం ఇవ్వాలని సామాన్యుడు కోరుకుంటున్నారు
.






