విద్యార్థి క్షేమసమాచారం తెలుసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.విద్యార్థులను పరీవేక్షించేందుకు ప్రధానోపాధ్యాయులతో పాటు కొత్తగా వాలంటీర్లు కు బాధ్యత అప్పగించింది.
ఇందు కోసం విద్యార్థి హాజరు నమోదు చేసుకునేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ‘ను ప్రవేశపెట్టింది.ఈ యాప్ లో విద్యార్థి హాజరును నమోదు చేస్తారు.
ఉదయం 11 గంటలకు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు హాజరు వివరాలు ‘డీఈఓ’ కార్యాలయానికి చేరతాయి.జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు ఎయిడెడ్ పాఠశాలలు 5,109 ఉండగా 6,06,753 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
విద్యార్థులంతా క్రమం తప్పకుండా స్కూలు హాజరయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.విద్యార్థులు పాఠశాలకు హాజరై అభ్యసన ప్రక్రియలో పాల్గొనేల ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఉంటుంది.
మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే ప్రాంతంలోని వాలంటీర్లు కు సమాచారం వెళుతుంది.దీంతో విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తిస్తారు.

ఒకవేళ విద్యార్థి అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆసుపత్రికి సమాచారం పంపుతారు.ఏ ఇతరత్రా కారణాలతో పాఠశాలకు వేల్లకపోతే తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తారు.గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు నమోదుపై దృష్టి సారించేవారు.ఇక నుంచి ప్రైవేట్ పాఠశాల నిర్వాహకులు కూడా విద్యార్థులు హాజరు స్టూడెంట్ అటెండెన్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఏడాదిలో 70 శాతం హాజరు లేకపోతే అమ్మ ఒడి పథకం కూడా వర్తించదని తేల్చి చెప్పింది.దీంతో ఇటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు హాజరు తప్పకుండా నమోద చేయాల్సిన పరిస్థితి నెలకొంది.