మాస్క్ విషయములో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

దేశంలో ఊహించనివిధంగా కరోనా కేసులు పెరిగిపోతుండటంతో ఇటీవల ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో దేశంలో సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు.

కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో కేసులు అధికంగా పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ దిశగా ఆలోచనలు చేస్తూ కర్ఫ్యూలు విధిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో కూడా కేసులు పెరుగుతుండటంతో తాజాగా ఏపీ ప్రభుత్వం మాస్క్ విషయములో కీలక నిర్ణయం తీసుకుంది.  మాస్క్ ధరించకుండా గ్రామాల్లో పట్టుబడితే 500 రూపాయలు పట్టణాల్లో పట్టుబడితే 1000 రూపాయలు ఫైన్ విధించాలని చలానా పుస్తకాలు తాజాగా పోలీసులకు కూడా ఇవ్వటం జరిగింది అన్నట్లు ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న టాక్.మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసులు పెరుగుతుండటంతో .అక్కడ లాక్‌డౌన్‌ విధించే ఆలోచనలో కెసిఆర్ సర్కార్ ఉంది.తెలంగాణ పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కొన్ని జిల్లాలలో ఇప్పటికీ లాక్‌డౌన్‌ అమలవుతోంది.

పైగా కొత్త వైరస్ కేసులు బయటపడుతూ ఉన్నాయి. దీంతో మహారాష్ట్ర సర్కార్ మరోసారి కరోనా నిబంధనలను చాలా కఠినంగా అమలు చేయటానికి పూనుకుంటుంది.

Advertisement

 .

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు