ఆర్థికంగా ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాల క్యాలెండర్ను పక్కాగా అమలు చేస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh ) ప్రభుత్వం ఇప్పుడు చేతులెత్తేసినట్లుగా కనిపిస్తుంది… ఆర్థిక పరిస్థితులు అనుకూలించనందున జగనన్న వసతి దీవెన పథకం తాత్కాలికంగా వాయిదా పడుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్వయంగా ప్రకటించడం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పాలి.అనంతపురంలో జరగాల్సిన జగనన్న వసతి దీవెన సభ రెండు రోజుల క్రితమే జరగాల్సి ఉన్నా బటన్ నొక్కిన తర్వాత అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయన్న భయంతో సభ వాయిదాకే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది.
ఇప్పుడు సంక్షేమ పధకాల క్యాలెండర్ లోని మిగతా పథకాల సంగతి ఏమిటంటూ అంటూ ఆయా పథకాలు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తుంది .వచ్చే 3 నెలల్లో వరుసగా వైయస్సార్( YSR ) రైతు.భీమా , జగనన్న విద్యా దీవెన, జగనన్న అమ్మ ఒడి( jagananna vidhya devana ) లాంటి కీలక పథకాలు అమలు చేయాల్సి ఉన్నందున అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ పదకాల లబ్ధిదారులకు నిధులు సమకూర్చడం ఇప్పుడు ప్రభుత్వానికి కత్తి మీద సామూలా మారినట్లుగా తెలుస్తుంది.
సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటు బ్యాంకు అంటూ ఇప్పటికే ప్రభుత్వం చాలాసార్లు బాహాటంగా ప్రకటించింది.అందరితో పన్నులు కట్టించుకుని కొంతమందికే వాటి ఫలితాలు ఇస్తున్నారు అంటూ కొన్ని వర్గాలు వాపోయిన కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలలో అమలు లో ముందుకే వెళ్ళింది.ఎన్నికలు ఒక సంవత్సరంలో ఉన్న ఇలాంటి తరుణంలో ఏ ఒక్క పథకం ఆగిపోయినా కూడా ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వం పాడిన కష్టం మొత్తం వృధా అవుతుందన్న ఆందోళనలో పార్టీ వర్గాలు ఉన్నట్లుగా తెలుస్తుంది….
అయితే .నిబంధనల ప్రకారం వాడుకోవాల్సిన మొత్తాలను ఇప్పటికే వాడి ఉన్నందున మరిన్ని అప్పులు తీసుకురావటం ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదని…మరొక సంవత్సరం పాటు ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు….మరి కీలకమైన ఈ సమయాన్ని వైసిపి ప్రభుత్వం ఏ రకంగా గట్టు ఎక్కుతుందో చూడాలి.