జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏపీ గవర్నమెంట్ అందుకు సిద్ధపడుతుందని వార్తలు వస్తున్నాయి .గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న విభేదాల రీత్యా సిబిఐ ని ఆంధ్ర ప్రదేశ్ లోకి నిషేధిస్తూ 2018 లో నిర్ణయం తీసుకున్నారు… ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం అధీనంలో నడిచే సిబిఐతో అనవసర ఇబ్బందులు వస్తాయన్న ముందు చూపుతోనే టిడిపి( TDP ) అధినాయకత్వం ఇలా చేసిందని వార్తలు వచ్చాయి.
అయితే అప్పట్లో ఈ నిర్ణయం పై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ పార్టీ సిబిఐ అంటే చంద్రబాబుకు భయమని,, తప్పు చేయకుంటే ఎందుకు నిషేధిస్తారు అంటూ ప్రశ్నించింది.అంతేకాకుండా వైసీపీ అధికారంలోకి రాగానే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది .కేంద్ర ప్రభుత్వం.తో .ఇంతకాలం సఖ్యత గా ఉంటూ వారికి అవసరమైనప్పుడల్లా లోక్సభ లోనూ రాజ్యసభ లోనూ మద్దతు ఇస్తూ ఉండటం వల్ల పరిపాలనలో పెద్దగా ఇబ్బందులు లేకుండా నెట్టుకొస్తున్న ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు వైయస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) హత్య కేసు దర్యాప్తులో సిబిఐ ప్రవర్తన చాలా ఇబ్బందులు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది.తమ పార్టీ కీలక నేత, వరుసకు సోదరుడైన అవినాష్ రెడ్డి ( Avinash Reddy )కుటుంబాన్ని కేంద్రంగా చేసుకొని దూకుడుగా ముందుకు వెళుతున్న సిబిఐ తీరు ప్రభుత్వ పెద్దలకు అసంతృప్తి కలిగిస్తుందని.
కేంద్ర ప్రభుత్వంతో కూడా సంబంధాలు దిగజారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సిబిఐ మరిన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని పార్టీ నాయకులకు అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తుంది.

అందువల్ల గత ప్రభుత్వం హయాంలో లాగే తాము కూడా సిబిఐ ని ఆంధ్ర ప్రదేశ్ లో నిషేధిస్తే ఎలా ఉంటుంది అంటూ ఆలోచనలు చేస్తున్నారట.అనవసరమైన తలపోట్లు తప్పించుకోవాలంటే ఇదే మార్గం అని ఆలోచిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి ….ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ కోర్టుల ద్వారా పర్మిషన్ తెచ్చుకొని ముందుకు వెళ్లే అవకాశం సిబిఐ కి ఉన్నప్పటికీ ప్రతి కేసులోనూ పర్మిషన్ తెచ్చుకోవడం వారికి కూడా కుదరదు కాబట్టి కొన్ని ఇబ్బందులు అయినా తొలగతాయని ఆలోచనలు ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అప్పట్లో విమర్శలు చేసినప్పటికీ ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం కూడా ఫాలో అవటం గమనార్హం.







