సమ్మె విరమించిన ఉద్యోగులు ... వారికి మాత్రం నిరాశే ?

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టదలచిన సమ్మె ను విరమించుకున్నారు ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలీకృతం కావడంతో ఉద్యోగ సంఘాల నాయకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ చర్చలు సఫలీకృతం కాకపోతే ఆరో తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలు కావాల్సి ఉంది.

పిఆర్సి విషయంలో ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వార్ మొదలైంది.మొదట్లో ప్రభుత్వం - ఉద్యోగ సంఘాల నేతలు ప్రతిష్టంభన కు వెళ్లడంతో ఈ వ్యవహారం రోజురోజుకు ముదురుతూనే వచ్చింది.

చివరకు చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేయగా, దీనికి భారీ స్థాయి ఉద్యోగులు హాజరు కావడంతో ఈ సమస్య మరింత తీవ్రరూపం దాలుస్తుందని అంతా భావించారు.నిన్న జరిగిన మంత్రుల కమిటీ,  ఉద్యోగ సంఘాల నేతలు మధ్య చర్చలు సఫలీకృతం అయ్యాయి.

 ఏపీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతోనే ఉద్యోగులు కోరిన విధంగా పిఆర్సి ఇవ్వలేకపోయాము అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో  చెప్పారు.ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుందని చెప్పిన సజ్జల  పిఆర్సి స్లాబుల్లో సవరణలు చేశామని ,నాలుగు శ్లాబులుగా దీనిని వర్గీకరించామని, ఫిట్మెంట్ 23% ఇస్తున్నామని చెప్పారు.

Advertisement

అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలోనూ మార్పులు చేశామని, అలాగే ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.ఐదేళ్లకే పీఆర్సీని అమలు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.

అలాగే అంత్యక్రియల ఖర్చు కూడా ఇచ్చేందుకు నిర్ణయించామని,  సిపిఎస్ రద్దు కు సంబంధించి మార్చి 31 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సజ్జల తెలిపారు.ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై స్పందించారు .గత రెండు రోజులుగా ప్రభుత్వంతో జరుగుతున్న చర్చలు సఫలీకృతం అయ్యాయని పిఆర్సి సాధన సమితి నేతలు బండి శ్రీనివాసరావు తెలిపారు.  ఉద్యోగుల డిమాండ్లను పెద్ద మనసుతో అంగీకరించిన ప్రభుత్వానికి ఉద్యోగులందరూ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

మొత్తంగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య చర్చలు సఫలీకృతం కావడంతో మొత్తం వ్యవహారం సద్దుమణిగింది.అయితే ఈ వ్యవహారం మాత్రం టిడిపి తో పాటు ఆ పార్టీ అనుకూల మీడియాకు తీవ్ర నిరాశ కలిగించే అంశమే.

ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాగా ముద్ర పడిన కొన్ని చానళ్లు అదే పనిగా డిబేట్లు నిర్వహించడంతో పాటు ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా కథనాలను ప్రచురిస్తూ వచ్చాయి.ఉద్యోగులు సమ్మెకు దిగితే ఏపీలో పాలన స్తంభించడంతో పాటు, ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయని, జగన్ మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారని అంచనా వేశాయి.ఉద్యోగులతో ప్రభుత్వం చర్చలు సఫలం కావడం వైసిపి రాజకీయ ప్రత్యర్థుల తో పాటు , ఓ వర్గం మీడియాకు తీవ్ర నిరాశే కలిగించాయి అనే చెప్పాలి.

' అల్లు ' కోసం దిల్ రాజు .. ఎంట్రీ  వెనుక కారణం ఇదా ?  
Advertisement

తాజా వార్తలు