ఏపీ ఓటర్లను కన్ఫ్యూజ్ చేస్తున్న ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏ పార్టీకి అనుకూలమో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఏ పార్టీ గెలుస్తుందో తేలిపోతుందని ఓటర్లు భావించగా అలా ఆశించడం అత్యాశే అవుతుందని క్లారిటీ వచ్చేసింది.

ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ( Exit polls)ఫలితాలకు సంబంధించి కొన్ని సర్వేలు వైసీపీదే విజయమని చెబుతుండగా మరికొన్ని సర్వేలు కూటమిదే గెలుపని చెబుతున్నాయి.

ఎన్నికల ఫలితాలకు 48 గంటల సమయం మాత్రమే ఉన్నా ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ మాత్రం ఓటర్లలో తగ్గలేదు.రైజ్ సంస్థ ఏపీలో 113 నుంచి 122 స్థానాల్లో కూటమికి విజయం దక్కనుందని 48 నుంచి 60 స్థానాల్లో వైసీపీకి విజయం దక్కనుందని తెలిపింది.

ఎంపీ స్థానాల విషయానికి వస్తే కూటమి 17 నుంచి 20 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని వైసీపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని ఈ సంస్థ చెబుతోంది.

Ap Exit Polls Survey Results Favour To Tdp Alliance And Ycp Details Here , Ap

ఆరా మస్తాన్ సంస్థ ( Aaraa Mastan )వైసీపీకి కనిష్టంగా 94 స్థానాల నుంచి గరిష్టంగా 104 స్థానాల్లో విజయం దక్కనుందని పేర్కొంది.కూటమికి మాత్రం 71 నుంచి 81 స్థానాల్లో మాత్రమే గెలుపు దక్కుతుందని తెలిపింది.ఆరా సర్వే ప్రకారం ఎంపీ స్థానాల విషయానికి వస్తే వైసీపీ 13 నుంచి 15 స్థానాల్లో గెలవనుండగా కూటమికి 10 నుంచి 12 స్థానాల్లో గెలుపు దక్కనుంది.

Advertisement
Ap Exit Polls Survey Results Favour To Tdp Alliance And Ycp Details Here , Ap

చాణక్య స్ట్రాటజీస్ కూటమి 114 నుంచి 125 స్థానాల్లో కూటమి గెలుస్తుందని చెబుతుండగా వైసీపీ 39 నుంచి 49 స్థానాలకు పరిమితమవుతుందని ఇతరులు ఒక స్థానంలో గెలుస్తారని తేల్చేసింది.ఈ సంస్థ లెక్కల ప్రకారం 17 నుంచి 18 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధించనుండగా 6 నుంచి 7 స్థానాల్లో వైసీపీకి గెలుపు దక్కనుంది.

ఆత్మసాక్షి సర్వే లెక్కలను పరిశీలిస్తే 98 నుంచి 116 స్థానాల్లో వైసీపీకి విజయం దక్కనుండగా 59 నుంచి 77 స్థానాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి.ఎంపీ స్థానాల్లో 17 స్థానాల్లో వైసీపీ గెలవనుండగా కూటమి 8 స్థానాలకు పరిమితం కానుంది.

పయనీర్ సంస్థ లెక్కల ప్రకారం ఏపీలో కూటమి 144 స్థానాల్లో విజయం సాధించనుండగా వైసీపీ 31 స్థానాలకు పరిమితమయ్యే అవకాశముంది.ఈ సంస్థ 20 ఎంపీ స్థానాలలో కూటమి 5 ఎంపీ స్థానాలలో వైసీపీ సత్తా చాటనుందని తెలిపింది.

Ap Exit Polls Survey Results Favour To Tdp Alliance And Ycp Details Here , Ap

రేస్ సంస్థ 117 నుంచి 128 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని 48 నుంచి 58 స్థానాలు మాత్రమే కూటమి ఫేవర్ గా ఉన్నాయని పేర్కొంది.ఈ సంస్థ 19 ఎంపీ స్థానాల్లో వైసీపీ 6 ఎంపీ స్థానాల్లో కూటమిది విజయమని వెల్లడించింది.పీపుల్స్ పల్స్ సంస్థ 111 నుంచి 135 స్థానాల్లో కూటమిది విజయమని వైసీపీ 2014 కంటే తక్కువగా 45 నుంచి 60 స్థానాల్లో గెలుస్తుందని చెప్పింది.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఈ సంస్థ 17 నుంచి 19 ఎంపీ స్థానాల్లో కూటమి, 3 నుంచి 5 ఎంపీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటనుందని పేర్కొంది.కేకే సర్వేస్ సంస్థ 161 స్థానాల్లో కూటమి 14 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని వెల్లడించింది.

Advertisement

ఈ సంస్థ వైసీపీకి ఒక్క ఎంపీ సీట్ కూడా రాదని పేర్కొంది.మరోవైపు పార్థా చాణక్య, ఆపరేషన్ చాణక్య, పోల్ స్ట్రాటజీ, అగ్నివీర్, పోల్ లాబొరేటరీ, జన్మత్ పోల్ సంస్థలు 95 నుంచి 128 స్థానాల్లో వైసీపీది విజయమని వేర్వేరు లెక్కలతో చెబుతున్నాయి.

టైమ్స్ నవ్ ఈటీజీ 14 ఎంపీ స్థానాల్లో వైసీపీ మిగతా స్థానాల్లో కూటమి, టీవీ9 ఎగ్జిట్ పోల్ 13 ఎంపీ స్థానాల్లో వైసీపీ మిగతా స్థానాల్లో కూటమిదే విజయమని చెబుతున్నాయి.

తాజా వార్తలు