ఎన్నికలవేళ ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఎనిమిది రోజులలో ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో సంచలన హామీలు ప్రకటిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రత్యర్థులపై విమర్శలు కూడా చేస్తున్నారు.2019 కంటే 2024 ఎన్నికలు చాలా కీలకంగా ఉన్నాయి.వైసీపీ( YCP ) ఒంటరిగా పోటీ చేస్తోంది.

టీడీపీ.బీజేపీ.

జనసేన( TDP, BJP, Jana Sena ) పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.వామపక్షాలు మరియు కాంగ్రెస్ కలసి పోటీ చేస్తున్నాయి.

ఏపీలో ఎన్ని పార్టీలు ఉన్నాగాని ప్రధాన పోటీ వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నెలకొంది.సరిగ్గా ఎన్నికలవేళ అత్యంత కీలక పరిణామం ఆదివారం చోటు చేసుకుంది.

Advertisement

విషయంలోకి వెళ్తే ఏపీ డీజీపీ కే.రాజేంద్రనాథ్ రెడ్డిని( AP DGP K.Rajendranath Reddy ) ఎన్నికల సంఘం బదిలీ చేయడం జరిగింది.విపక్షాల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న ఎలక్షన్ కమిషన్ ఈ మేరకు చర్యలు తీసుకుంది.

విధులనుంచి తక్షణమే రిలీవ్ కావాలని డీజీపీని ఆదేశించింది.ఇదే సమయంలో ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లతో రేపు ఉదయం 11 గంటలలోపు జాబితా పంపాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి ఈసీ సూచించింది.

రాజేంద్రనాథ్ రెడ్డికి ఎన్నికల విధులు కేటాయించకూడదని స్పష్టం చేసింది.డీజీపీని బదిలీ చేయాలని కొన్ని రోజులుగా కూటమి నేతలు చేస్తున్న ఫిర్యాదులకు ఈసీ ఆదివారం స్పందించి.

ఈ నిర్ణయం తీసుకోవడం ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించింది.

ఏపీ సీఎంగా చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం..!!
Advertisement

తాజా వార్తలు