పవన్ కోసం రేణు ఇంత పెద్ద సినిమా నుంచి తప్పుకుందా ? బద్రి సినిమా తర్వాత ఏం జరిగింది ?

పూణేలో గుజరాతీ కుటుంబంలో జన్మించింది రేణు దేశాయ్( Renu Desai ).మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో నటిగా తమిళ సినిమా ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి ఎంట్రీ ఇచ్చింది.

 Why Renu Desai Left Movie Industry , Renu Desai , Pawan Kalyan, Badri ,johnny-TeluguStop.com

పార్తిబన్ జేమ్స్ పాండు సినిమాలో హీరోయిన్ గా నటించింది.అదే ఏడాది పూరి జగన్నాథ్ బద్రి సినిమా( Badri ) కోసం హీరోయిన్స్ చూడటం మొదలుపెట్టాడు.

తన సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒక పాత్ర కోసం అమీషా పటేల్ నీ మరో పాత్ర కోసం రేణు దేశాయ్ బి ఎంచుకున్నాడు.అలా అదే సంవత్సరం బద్రి సినిమా షూటింగ్ కూడా మొదలైంది.

పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే వారిద్దరి మధ్య ప్రేమ బీజం మొలకెత్తింది.

-Movie

అలా వారిద్దరి మధ్య సహజీవనం కూడా మొదలయ్యింది.ఈ సినిమా కూడా 2000 సంవత్సరం లోనే విడుదలయ్యింది ఆ తర్వాత వీరిద్దరి మధ్య పెళ్లి కాకుండానే రిలేషన్ షిప్ ఏర్పడింది అని టాలీవుడ్ లో అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే ఆమె కెరియర్ పూర్తిగా పూర్తయిపోయింది.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ని ప్రేమించిందో అప్పుడే ఆమే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.కేవలం ఎవరితో ప్రేమలో ఉన్న కారణంగానే మరే సినిమాలో కూడా ఆమె నటించలేదు.2003లో జానీ సినిమా( Johnny ) కోసం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మారగా అందులో హీరోయిన్ పాత్రలో రేణు దేశాయ్ నటించింది.అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ కోసమే నటించింది.

-Movie

అయితే ఆమె తలుచుకుంటే అప్పట్లో అనేక సినిమాల్లో నటించేది బద్రి సినిమా పూర్తవగానే ఆమెకు మురారి సినిమా( Murari )లో సోనాలి బిండ్రే పాత్రలో నటించే అవకాశం వచ్చింది.రేణు దేశాయికి కూడా ఆ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది.కేవలం పవన్ కళ్యాణ్ తో ప్రేమలో ఉన్న కారణంగానే ఆమె ఎంత పెద్ద సినిమా అయినా కూడా పక్కన పెట్టింది.తన భర్త తప్ప ఇంకొక ప్రపంచం అవసరం లేదు అనుకుంది.

మరెవరితోనూ లిప్ లాక్ సీన్స్ , హగ్గులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని నిర్ణయించుకుంది.ఒకవేళ మురారి సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించి ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఆమె స్థాయి మరోలా ఉండేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube