టీడీపీ నేతలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి( AP Deputy Speaker Kolagatla Veerabhadra Swamy ) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఈ క్రమంలో నారా లోకేశ్, అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేశారు.
ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తాము అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు( TDP Leaders ) డ్రగ్స్ వ్యాపారం చేశారన్నా ఆయన తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని తెలిపారు.
జగనన్న కాలనీలకు భూములు( Jagananna Colony ) ఇచ్చిన రైతుల్లో అన్ని పార్టీల వారు ఉన్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే తమ కుటుంబ సభ్యుల పేర్లపై డాక్యుమెంట్స్ ఉంటే చూపించండని తెలిపారు.
చేసిన అభివృద్ధి, సంక్షేమ గురించి చెప్పి ఓట్లు అడగాలని చెప్పారు.నలభై ఏళ్ల తన రాజకీయ చరిత్రలో తన జీవితం తెరిచిన పుస్తకమని వెల్లడించారు.







