ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు రేపు ఉదయం 10 గంటలకు ఆయన హస్తినకు బయలుదేరనున్నారు.
రెండు రోజులపాటు సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారు.ఈ క్రమంలో పలువురు కేంద్రమంత్రులతో పాటు పెద్దలను సీఎం జగన్ కలవనున్నారని తెలుస్తోంది.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది.ఈనెల 6 వ తేదీన విజ్ఞాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే.
కాగా ఈ సమావేశానికి సీఎం జగన్ హాజరుకానున్నారు.







