2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారి చర్యలతో వివాదాస్పదమౌతున్న విషయం తెలిసిందే.ఆమధ్య ప్రభుత్వ భవనాలపై కూడా వైసీపీ రంగులు పూసి వివాదాస్పదమైన విషయం తెలిసిందే.
అయితే తాజాగా తహసీల్దార్ కార్యాలయాల నుంచి జారీ అయ్యే కుల,ఆదాయ,నివాస ధ్రువీకరణ పత్రాలు వివాదానికి కారణమయ్యాయి.ఆ ధ్రువీకరణ పత్రాల్లో ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉండాల్సివుండగా ఆ పత్రాల్లో ఏపీ సీఎం జగన్ ఫోటో ను కూడా ముద్రించడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవానికి ఇలాంటి ధ్రువీకరణ పత్రాల్లో ప్రభుత్వ ముద్ర మాత్రమే ఉంటుంది.వాటిపై ఏ ఇతర పార్టీలకు,వ్యక్తులకు చోటుండదు.
కానీ ఈ ధ్రువీకరణ పత్రాల్లో జగన్ ఫోటో ఉండడం తో మరోసారి ఏపీ సర్కార్ వివాదంలో చిక్కుకుంది.

ప్రభుత్వాలను నడిపేవారు మారుతుంటారు.కానీ ప్రభుత్వం మాత్రం శాశ్వతంగా ఉంటుందని.ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అలా ఎలా మరిచారని విపక్షాలు ఘాటుగా ప్రశ్నిస్తున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలతో ఇలా చేశారా లేక అధికారులే అత్యుత్సాహంతో ఇలా చేశారా అన్నది తేలాల్సి ఉంది.గతంలో ఇలానే ప్రభుత్వ భవనాలపై వైసీపీ తమ పార్టీ రంగులు అలంకరించడం తో పెద్ద వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
ఈ విషయం పై ప్రతిపక్షాలు కోర్టు వరకు కూడా వెళ్లడం తో కోర్టు కూడా పార్టీ రంగులు వేయడం తప్పు అని స్పష్టం చేసింది.