వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఎటువంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.నిర్ణయం తీసుకునే ముందు కూడా వెనక ముందు ఆలోచించరు.
కనీసం పార్టీ కీలక నాయకులను కూడా సంప్రదించే అలవాటు జగన్ కు లేదు.ఈ వ్యవహారశైలి జగన్ కు తీవ్ర విమర్శలు తెచ్చిపెడుతోంది.
ఈ విషయం జగన్ కు తెలిసినా ఆయన వ్యవహారశైలిలో మార్పు అయితే కనిపించడం లేదు.దీంతో వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో అధికారుల్లోనూ తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
మొన్నటి వరకు ఎలా ఉన్నా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడంతో వైసిపి ప్రభుత్వం, జగన్ వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వైసిపి ప్రభుత్వం ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.
ఆయన కులాన్ని కూడా ప్రస్తావిస్తూ అభాసుపాలు చేసే విధంగా వ్యవహరించారు.దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.సాక్షాత్తు రాజ్యాంగ పదవిలో ఉన్న ఎన్నికల అధికారిని ఈ విధంగా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం ఆయన తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టడం ఇవన్నీ జగన్ ఆ పార్టీ నాయకులు గీత దాటినట్టుగా కనిపిస్తోంది.కరోనా వైరస్ ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించడంతో ఈసి ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
దీంతో జగన్ ఆ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.వాస్తవంగా చూస్తే కరోనా ప్రభావం దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉంది.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
గుంపులుగా ఎక్కడికి వెళ్లొద్దు అని చెబుతున్నారు.ఇప్పటికే అనేక సంస్థలను అప్రమత్తం చేశారు.దాదాపుగా ఏ నగరంలో చూసిన ఇప్పుడు వాతావరణం కనిపిస్తోంది.
రోడ్ల మీదకు వచ్చేందుకు కూడా జనాలు ఇష్టపడడం లేదు.ఇలా ఏపీలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో కరోనా హడావుడి పై ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుండగా, జగన్ ప్రభుత్వం మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు వేయడం లేదు సరికదా, ఆ ప్రభావం ఏపీలో లేదన్నట్లుగా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
కరోనా ప్రభావం ఏపీలో లేదన్నట్టుగా వైసీపీ నాయకుల వ్యవహార శైలి ఉంది.వాస్తవంగా చూస్తే ఎన్నికల వాయిదాకు రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ఎన్నికల అధికారి సంప్రదించాల్సిన అవసరం లేదు.
అసలు రాజ్యాంగంపై అవగాహన ఉన్న వారు ఎవరు ఆ విధంగా మాట్లాడరు.కానీ వైసిపి నాయకులు తాము రాజ్యాంగానికి అతీతులం అన్నట్టుగా మాట్లాడడమే ఇప్పుడు చర్చకు వస్తోంది.
ఒక్కసారి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషనర్ సర్వాధికారి.కానీ అవన్నీ మరిచిపోయి అసలు ముఖ్యమంత్రి రమేష్ కుమార్ నా నేనా అంటూ జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడడం విచిత్రంగా కనిపిస్తోంది.
రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని కులం పేరుతో తిట్టడ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.చివరకు రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ కూడా ఎన్నికల అధికారి మీద వ్యక్తిగత దూషణలకు దిగడం మరీ విచిత్రంగా కనిపిస్తోంది.
ఇలా ఒకటి కాదు రెండు కాదు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే విధంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతోంది.