ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలోను, ప్రభుత్వంలోను అన్నీ తానే వ్యవహరిస్తున్నారు ఇక మంత్రి మండలిలో కూడా పూర్తిగా తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను సామాజిక వర్గాల సమీకరణలు ప్రకారం నియమించుకున్నారు.అప్పటి నుంచి తన నిర్ణయాలకు ఎదురు లేకుండా జగన్ చేసుకోగలిగారు.
ఎన్నికలకు ముందు టికెట్ల కేటాయింపులోనే జగన్ ఇదే సూత్రాన్ని అమలు చేసి తనకు అనుకూలంగా ఉండే గెలుపు గుర్రాలకే టికెట్లు కట్టబెట్టి 151 సీట్లతో బంపర్ మెజారిటీ సాధించారు.అయితే మంత్రివర్గ ఏర్పాటు సమయంలో మంత్రులుగా నియమించిన వారికి మొదట్లోనే జగన్ హెచ్చరికలు చేశారు.

ఎవరి పనితీరు బాగోకపోయినా నిర్ధాక్షణ్యంగా మంత్రి పదవి నుంచి తప్పిస్తానని, ఈ విషయంలో తనకు ఎటువంటి మొహమాటం లేదని, ప్రజలకు , ప్రభుత్వానికి పార్టీకి సమర్థవంతంగా సేవలు అందించే వారు మాత్రమే తనకు అవసరం అని, మిగతా వారిని పక్కన పెట్టేస్తా అని జగన్ గట్టిగానే హెచ్చరికలు చేశారు.మొదట్లో జగన్ మాటలను సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు మాత్రం ఆ హెచ్చరికలను పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా కొంతమంది మంత్రులు జగన్ ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో వేలు పెడుతూ, అనవసర తలనొప్పులు తీసుకొస్తున్నారు.
ఇక ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ హడావుడిలో జగన్ ఉన్నారు.నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తతో వ్వహరించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు.
ప్రతి ప్రజా ప్రతినిధి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని వారికి మెరుగైన పాలన అందించాలని సూచనలు చేస్తున్నా వారు యధావిధిగా గ్రూపు రాజకీయాలకు తెర తీస్తూ ఆధిపత్య పోరు కొన సాగిస్తూ ఉండడం తదితర అంశాలపై జగన్ కు నివేదికలు అందాయి.ప్రస్తుతం రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉన్న మంత్రులు వ్యవహార శైలి లో మార్పు రాకపోగా, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తుండడం పై జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కరోనా వ్యవహారంతో తీరిక లేకుండా ఉండడంతో పూర్తిగా ఈ వ్యవహారం ముగిసిన తర్వాత మాట వినని మంత్రులు, పార్టీ శ్రేణులపై వేటు వేసే విధంగా జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.