పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా( Ustaad Bhagat Singh ) నుంచి తాజాగా గ్లింప్స్ విడుదల కాగా ఈ గ్లింప్స్ ఎంతగానో నచ్చేసిందని అభిమానులు చెబుతున్నారు.వ్యూస్ విషయంలో ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో అదరగొడుతోంది.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ లో పొలిటికల్ డైలాగ్స్ ఉండటం గురించి ఏపీ సీఈవో ముఖేశ్ కుమార్ మీనా( AP CEO Mukesh Kumar Meena )కు ప్రశ్న ఎదురు కాగా ఆయన ఎన్నికల నిబంధనల గురించి వెల్లడించారు.ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ను తాము ఇంకా చూడలేదని ఒకవేళ ఉద్దేశపూర్వకంగా షూట్ జరిగిందా లేదా అనే అంశాన్ని పరిశీలించి ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.

ఎన్నికల కోడ్( Election Code ) అమల్లోకి వచ్చిన తర్వాత మూడు రోజుల్లోనే 385 కేసులు నమోదు చేశామని ఆయన అన్నారు.40 మంది వాలంటీర్లను సస్పెండ్ చేశామని కొంతమందికి లీగల్ నోటీసులు ఇచ్చామని ముకేశ్ కుమార్ మీనా( Mukesh Kumar Meena ) పేర్కొన్నారు.మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి గ్లింప్స్( Ustaad Bhagat Singh Glimpse ) విడుదలైనా ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే క్లారిటీ ఏ మాత్రం లేదనే సంగతి తెలిసిందే.ఉస్తాద్ భగత్ సింగ్ పాన్ ఇండియా మూవీగా విడుదలవుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.
ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ ఫ్యాన్స్ ను పూర్తిస్థాయిలో దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫ్యాన్స్ వచ్చే ఏడాది ఈ సినిమా విడుదలవుతుందని భావిస్తున్నారు.ఈ సినిమాలో శ్రీలీల రోల్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ పరంగా భారీ మూవీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.