ఏపీ ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ సమావేశం జరిపిన విషయం అందరికి తెలిసిందే.కేబినెట్ సమావేశం ముగియడంతో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను ఆమోదం తెలిపింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.ఈ సమావేశంలో ప్రత్యేకంగా విద్యార్థులకు, డ్వాక్రా మహిళలకు లబ్ధి చేకూరింది.
సమావేశంలో నూతన పారిశ్రామిక విధానం అమలు చేశారు.దీనికి సంబంధించి 2020 నుంచి 2023 వరకు ఈ విధానం కొనసాగుతుంది.విద్యార్థుల కోసం వైఎస్సార్ విద్యాకానుక పథకాన్ని ఆమోదించారు.ఈ పథకం సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
డ్వాక్రా మహిళల కోసం వైఎస్సాఆర్ ఆసరా పథకాన్ని ఆమోదించారు.ఈ పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.27 వేల కోట్లు బడ్జెట్ కేటాయించనున్నారు.సెప్టెంబర్ 1 తేదీ నుంచి వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార పథకాన్ని ఆమోదించారు.
పంచాయతీ రాజ్ విభాగంలో 51 డివిజన్ డెవలప్ మెంట్ అధికారుల పోస్టుల భర్తీకి ఓకే చెప్పారు.విశాఖలో 1జీ డబ్ల్యూ డేటా సెంటర్ ఏర్పాటు, కడప జిల్లాలో పోలీస్ శాఖ బలోపేతానికి చేయనున్నారు.
వైఎస్సార్ బీమా పథకంతో సామాజిక భద్రతను కల్పించనున్నారు.చిత్తూరు, కడప జిల్లాల్లో కొత్తగా ఏర్పాటైన డిగ్రీ కళాశాలలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాప్ పోస్టుల భర్తీపై నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకాలు త్వరలో అమలు కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.







