ఏపీ కేబినెట్ సమావేశం( AP Cabinet Meeting ) ముగిసింది.సీఎం జగన్( CM Jagan ) అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీకి( Mega DSC ) ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
సుమారు 6,100 పోస్టులతో డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ ఆమోదం చెప్పింది.యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచింది.
అలాగే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడతకు ఆమోదం తెలపడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.దాంతోపాటు ఎస్ఐసీబీ ఆమోదించిన తీర్మానాలకు సిగ్నల్ ఇచ్చింది.ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.