ఫిబ్రవరిలో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ఫిబ్రవరి చివరి వారం నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
సుమారు 22 పని దినాలు ఉండేలా సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పరిపాలనా రాజధానిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.
మార్చి 3, 4 తేదీల్లో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరగబోతోంది.ఆ తర్వాత మార్చి 28, 29 తేదీల్లో జీ-20 వర్కింగ్ గ్రూప్ సదస్సు నిర్వహించనున్నారు.
వీటికంటే ముందుగానే అసెంబ్లీ బడ్జెట్ సెషన్ 2023-24ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.







