బాలకృష్ణ కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండటానికి అసలు కారణాలివే!

సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అయినప్పటికీ చిరంజీవి, బాలకృష్ణలకు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు.యంగ్ జనరేషన్ ఆడియన్స్ లో కూడా చాలామంది చిరంజీవి, బాలయ్యలను ఎంతగానో అభిమానిస్తారనే సంగతి తెలిసిందే.

 Reasons Behind Balakrishna Market Is Greater Than Chiranjeevi Market Details, Ba-TeluguStop.com

గత కొన్నేళ్లలో పరిశీలిస్తే చిరంజీవి మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా బాలయ్య మార్కెట్ పెరుగుతున్నా చిరంజీవి స్థాయిలో అయితే పెరగడం లేదు.

బాలకృష్ణ కంటే చిరంజీవి మార్కెట్ ఎక్కువగా ఉండటానికి కారణాలేంటనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టగా బాలయ్య ఎక్కువగా మాస్ సినిమాలపై దృష్టి పెట్టడం ఆయనకు ఒక విధంగా మైనస్ అయింది.బీ, సీ సెంటర్లలో బాలయ్య సినిమాలు ఆడిన స్థాయిలో ఏ సెంటర్లలో బాలయ్య సినిమా ఆడటం లేదు.

మరోవైపు కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సినిమాలు తక్కువగా ఉండటం, వరుసగా విజయాలను సొంతం చేసుకునే విషయంలో బాలయ్య ఫెయిల్ కావడం కూడా ఆయన సినీ కెరీర్ పై ప్రభావం చూపింది.సినిమాలను సరైన టైమ్ లో రిలీజ్ చేయకపోవడం, రిలీజ్ డేట్ల ఎంపికలో పొరపాట్లు కూడా బాలయ్యకు మైనస్ అవుతున్నాయి.ఇతర భాషలపై బాలయ్య దృష్టి పెట్టకపోవడం ఆయన సినిమాలపై ఎఫెక్ట్ చూపుతోంది.

ఈ పొరపాట్లను బాలయ్య సరిదిద్దుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ కావడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వినిపిస్తున్నాయి.కాలానికి అనుగుణంగా బాలయ్య ఇప్పటికే కొన్ని విషయాలలో మారగా మరికొన్ని విషయాలలో మారాల్సి ఉంది.రాబోయే రోజుల్లో బాలయ్య చిరంజీవి మధ్య పోటీ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

బాలయ్య, చిరంజీవి బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సీనియర్ హీరోలలో చిరంజీవి నంబర్ 1 స్థానంలో ఉండగా బాలయ్య నంబర్2 స్థానంలో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube