వినాయక చవితి వేడుకలు బయట జరుపు రాదంటూ ఆంక్షలు విధించడం ఏమిటని ఈ ప్రకటనలో వెంటనే ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు.ఆదివారం కర్నూల్ లోని పరిణయ ఫంక్షన్ హాల్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సత్యకుమార్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతూ చవితి వేడుకలను ఇళ్లలో మాత్రమే నిర్వహించుకోవాలని ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం తరఫున డీజీపీ ఈ ప్రకటన చేశారని దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ పేరుతో చవితి ఉత్సవాలను జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని, దీనికి బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోదన్నారు.చర్చిలో ప్రార్థనలు జరుగుతున్నాయని, ఇటీవలే మొహర్రం వేడుకలు నిర్వహించారని, క్రిస్మస్, బక్రీద్ పండుగ సందర్భంలో ఎలాంటి ప్రకటనలు చేయని ప్రభుత్వం చవితి వేడుకలపై ఆంక్షలు విధించిడం ఏమిటని ప్రశ్నించారు.
తిరుపతిలో ప్రతిరోజు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారని అక్కడ హుండీ లో ప్రజలు డబ్బులు వేస్తున్నారు కాబట్టే అక్కడ అనుమతిస్తున్నారని ప్రశ్నించారు.కోవిడ్ తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వమే చెబుతుందని.
సినిమాలకు అనుమతి ఇచ్చారని మరి ఇప్పుడు ఈ నిబంధనలు ఏమిటని ప్రశ్నించారు.

కేంద్రం నుండి సంక్షేమ పథకాలు రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని.విషయాన్ని ప్రస్తావించకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేయడం తగదన్నారు.దేశంలో సంక్షేమానికి ఆద్యుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రమేనన్నారు.కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2 వేల కోట్లతో టెండర్లు పిలిచినా పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని వీర్రాజు విమర్శించారు.గృహ నిర్మాణాల కోసం జరిగిన భూములు కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు.సమావేశంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు చంద్రమౌళి, రాష్ట్ర కార్యదర్శి కనిగిరి నీలకంఠ, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.