తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగుతున్న వైవి సుబ్బారెడ్డిని తప్పించి ఆస్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి( MLA Bhumana Karunakar Reddy )ని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .ఈనెల 10న కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
గతంలోనూ ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేసిన అనుభవం ఉండడంతో జగన్ ఆయనను చైర్మన్ గా నియమించారు.అయితే ఆయన నియామకంపై పెద్ద దుమారమే రేగుతోంది.
కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ అని, ఎన్నికల అఫిడవిట్ లో కూడా క్రిస్టియన్ గా పేర్కొన్నారని, అటువంటి వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించడం తగదంటూ అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.అయినా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు.
ఇక ఈ విషయంలో రాజీ లేకుండా పోరాడుతామని , కరుణాకర్ రెడ్డిని అసలు పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఎలా కూర్చోబెడతారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ప్రశ్నిస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం( TTD ) రాజకీయ పునరావసం కాకూడదని ఆమె అన్నారు.హిందూ ధర్మం పై నమ్మకం ఉన్నోళ్లు మాత్రమే ఈ పదవికి న్యాయం చేయగలరని పురందరేశ్వరి పేర్కొంటున్నారు. హిందూ ధర్మాన్ని అనుసరించని వాళ్లను ఏ విధంగా టీటీడీ చైర్మన్ గా నియమిస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.‘ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవీ కారాదు, హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లు ఈ పదవికి న్యాయం చేయగలరు.ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం జరిగింది.
ఈ విషయంపై గళం విప్పిన తరువాత 52 మంది నియామకాలను నిలిపివేశారు అంటే… ప్రభుత్వం ఈ నియామకాలను కూడా రాజకీయ పునరవ నియామకాలుగానే పరిగణిస్తున్నది అని అర్థమవుతుంది.కనుక టీటీడీ చైర్మన్ పదవిలో హిందూ ధర్మంపై నమ్మకం ఉన్న వారిని హిందూ ధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలి అంటూ ఆమె సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ఇక ఈ విషయంలో బిజెపి తరఫున తాము పోరాటం చేస్తామని, ఈ విషయంలో వైసీపీ ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయంపై పెద్ద రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో, జగన్ ఈ విషయంలో ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటారా లేక , ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.