ఏపీ( AP bjp )లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గెలుపే లక్ష్యంగా కమలం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తుంది.ఇందులో భాగంగా ఇవాళ, రేపు బీజేపీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు.
రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు పొత్తులపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లీడర్ల భేటీ ప్రారంభం కానుండగా.కోర్ కమిటీ నేతలతో పాటు జిల్లాల్లోని ముఖ్యనేతలు హాజరుకానున్నారు.అలాగే ఈ సమావేశానికి పార్టీ జాతీయ నేత శివ ప్రకాశ్ ( Shiv Prakash )కూడా హాజరుకానున్నారు.
కాగా వారం రోజుల్లో పొత్తులపై క్లారిటీ వస్తుందని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం జాతీయ నేత శివ ప్రకాశ్ తో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandeswar ) భేటీ అయ్యారు.
ఇందులో భాగంగా జిల్లాల నుంచి పొత్తులపై నేతల అభిప్రాయాలను శివప్రకాశ్ తెలుసుకుంటున్నారని సమాచారం.