ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దగ్గుపాటి పురందరేశ్వరుని తప్పించి ఆస్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో బిజెపి అధిష్టానం ఉన్నట్లు ఇపటికే ప్రచారం జరుగుతుంది .ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పై బిజెపి అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయిం ఏపీలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై పురందరే దృష్టి పెట్టకుండా, పరోక్షంగా టిడిపికి సహకారం అందిస్తున్నారని, ఒంటెద్దు పోకడలతో పార్టీని బలహీనం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి.
దీనికి తగ్గట్లుగానే పురంధరేశ్వరి సైతం టిడిపికి మద్దతుగా వ్యవహరిస్తూ వస్తున్నట్లుగా వ్యవహార శైలి ఉంది.టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో , పురందేశ్వరి వ్యవహరించిన తీరు బిజెపి అధిష్టానం పెద్దలకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందట.
పురందేశ్వరిని కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రభావం మరింత తగ్గుతుందని, బిజెపిలోకి చేరికలు ఉండవని అంచనా వేస్తున్న బీజేపీ అధిష్టానం, ఆమె స్థానంలో మరో వ్యక్తికి బిజెపి ఏపీ అధ్యక్ష పదవిని అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చిట్ట చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కిరణ్ కుమార్ కి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం తో పాటు, ఏపీలో విస్తృతంగా పరిచయాలు ఉండడం, మంచి వాక్చాతుర్యం ఇవన్నీ బిజెపి బలోపేతానికి పనికి వస్తాయని ఆ పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారట.దీనికి తోడు ఏపీలో రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి అధ్యక్ష పదవిని అప్పగిస్తే , రాయలసీ జిల్లాలో బిజెపి బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని బిజెపి పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారట.ఇక బీజేపీ లో మరో కీలక నేత సత్య కుమార్ పేరు కూడా ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు సమాచారం.