న్యూస్ రౌండప్ టాప్ 20

1.చిరంజీవి వ్యవహారంపై కొడాలి నాని కామెంట్స్

చిరంజీవిని విమర్శించే అంత సంస్కారహీనుడిని కాదు అని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.

ఈరోజు గుడివాడలో నిర్వహించిన చిరంజీవి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న నాని కేక్ కట్ చేసి చిరు అభిమానులకు పంచారు .ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

2.టిటిడి మరో కీలక నిర్ణయం

భక్తుల లగేజీ విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.లగేజీ కేంద్రాల్లో ఇబ్బందులను అధిగమించేందుకు టీటీడీ సెక్యూరిటీ, దాతల సహకారంతో కొత్త సాఫ్ట్ వేర్ ను తీర్చిదిద్దింది.

3.ఢిల్లీకి చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబు ఈనెల 28న ఢిల్లీకి వెళ్ళమన్నారు.

4.వైద్య పరీక్షలు చేయించుకున్న జగన్

ఏపీ సీఎం జగన్ విజయవాడలోని ఓ  ల్యాబ్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.కొద్దిరోజులుగా కాలి మడమ నొప్పితో జగన్ బాధపడుతున్నారు.

5.నారా బ్రాహ్మణి కామెంట్స్

పాడే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామని హెరిటేజ్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి వెల్లడించారు.

6…శ్రీవారి బ్రహ్మోత్సవాలు

అధికమాసం సందర్భంగా తిరుమల శ్రీవారికి ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల , అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

7.నడక దారి సమీపంలో ఎలుగుబంటి

Advertisement

అలిపిరి , తిరుమల నడకదారిలో ఏడో మైలురరాయి వద్ద ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది.

8.ఏపీ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు

ఏపీ ప్రభుత్వం సాధించింది అప్పులు ,అవినీతిలో ప్రగతి అని తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు.

9.కెసిఆర్ కు డీకే అరుణ సవాల్

తెలంగాణ సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఈటెల రాజేందర్ పై పోటీ చేయాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సవాల్ చేశారు

10.  కవిత ఆగ్రహం

మహిళా రిజర్వేషన్లపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రెండుసార్లు మోసం చేసిందని, సంఖ్యా బలం ఉన్న బీజేపీ మహిళా బిల్లులను ఎందుకు ఆమోదించడం లేదని కవిత బిజెపిపై విమర్శలు చేశారు.

11.నాకు అన్యాయం జరిగింది : టిఆర్ఎస్ ఎమ్మెల్యే

టికెట్ల కేటాయింపులు తనకు అన్యాయం జరిగిందని , పార్టీ మారే విషయంలో తాను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని ఖానాపూర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ అన్నారు.

12.సిపిఎం సిపిఐ రాష్ట్ర కమిటీల సమావేశాలు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న రానున్న ఎన్నికల లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.దాంట్లో తమకు అవకాశం దక్కకపోవడంతో విడివిడిగా రాష్ట్ర కమిటీలు సమావేశాలను సీపీఐ, సీపీఎం  లు ఈ రోజు నిర్వహించాయి.

13.తిరుమల సమాచారం

నేడు ఆన్లైన్ విధానంలో నవంబర్ నెల టికెట్లను టిటిడి విడుదల చేయనుంది.ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, అజిత బ్రహ్మోత్సవం, పూజ సేవ ,సహస్ర దీపాలంకరణ టిక్కెట్లను విడుదల చేసింది.

14.నేడు విశాఖకు కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి

నేడు విశాఖపట్నం కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి నాగేందర్ నాథ్ సేన రానున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు అఖిలపక్ష కార్మిక సంఘాలతో ఆయన సమావేశం అవుతారు.

15.తెలంగాణ క్యాబినెట్ విస్తరణ

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

రేపు తెలంగాణ క్యాబినెట్ ను విస్తరించేందుకు కేసిఆర్ నిర్ణయం తీసుకున్నారు.మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పిస్తున్నారు.

16.గన్నవరంలో టిడిపి బహిరంగ సభ

నేడు గన్నవరంలో టిటిడి బహిరంగ సభను మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనుంది.

17.ఆర్థిక శాఖ పై జగన్ సమీక్ష

Advertisement

ఈరోజు ఉదయం 11 గంటలకు ఆర్థిక శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఏపీ ఆర్థిక పరిస్థితి ఆదాయంపై ఉన్నత స్థాయి చర్చ నిర్వహించారు.

18.సిపిఐ బస్సు యాత్ర

రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అంటూ సిపిఐ రాష్ట్రపతి చేపట్టిన బస్సు యాత్ర రాజమండ్రి కి చేరుకుంది.

18.చంద్రబాబుపై మంత్రి విమర్శలు

మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని,  14 ఏళ్లలో ఏమి చేశారని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు టిడిపి అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు.

19.మైనంపల్లి హనుమంతరావు వివరణ

తాను పార్టీని విమర్శించలేదని , కేవలం మంత్రి హరీష్ రావును మాత్రమే విమర్శించానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వివరణ ఇచ్చారు.

20.టిడిపి బోగస్ ఓట్ల పై ఫిర్యాదు

టిడిపి బోగస్ వాటర్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే పర్చూరు వైసిపి ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.

తాజా వార్తలు