న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఢిల్లీ లిక్కర్ స్కాం

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను ఈడి అధికారులు విచారించాల్సి ఉండగా,  తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడి అధికారులకు లేఖ రాశారు.

2.వివేక హత్య కేసు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నేడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని మరోసారి సిబిఐ అధికారులు విచారించాల్సి ఉన్నా తాను హాజరు కాలేను అంటూ ఆయన సీబీఐ అధికారులకు తెలిపారు.

3.పేపర్ లీక్ కేసు

సంచలనం సృష్టించిన టీ ఎస్ పీ ఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై ఈరోజు కోర్టులో విచారణ జరిగింది.నిందితులకు పది రోజుల కస్టడీని పోలీసులు కోరారు.

4.భట్టి విక్రమార్క పాదయాత్ర

నేటి నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర అదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభం కానుంది.

5.దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు : రాహుల్

భారతదేశానికి వ్యతిరేకంగా నేను ఏమీ మాట్లాడలేదని , వాళ్లు అవకాశం ఇస్తే పార్లమెంట్ లో నేను మాట్లాడుతాను అంటూ కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు.

6.కవితపై బండి సంజయ్ విమర్శలు

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడి విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరు అవుతుండడం పై హై డ్రామా నడుస్తోంది.ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు చేశారు.కేసీఆర్ బిడ్డకు జైలు రెడీ అవుతుందని ఎద్దేవా చేశారు.

7.ఏపీ బడ్జెట్ అచ్చెన్న నాయుడు కామెంట్స్

ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2.79 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా రాష్ట్రంలో ఏ ఒక్కరు సంతోషంగా లేరని టిడిపి ఏపీ అధ్యక్షుడు  అచ్చెన్న నాయుడు విమర్శించారు.

8.నేడు ఢిల్లీకి జగన్

ఏపీ సీఎం జగన్ ఈరోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.

9.బడ్జెట్ ఆందోళనలో పాల్గొన్న బాలకృష్ణ

ఏపీ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద ఈరోజు టిడిపి శాసనసభ పక్షం నిరసనకు దిగింది.ఈ నిరసనల్లో టిడిపి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.

10.నేడు విచారణకు హాజరు కాలేను : అవినాష్ రెడ్డి

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి విచారణ కు ఈ రోజు హాజరు కావాల్సి ఉన్నా మ.   తాను ఈరోజు విచారణకు హాజరు కాలేనని అవినాష్ రెడ్డి సీబీఐ కు తెలియజేశారు.

11.ప్రధాని తమిళనాడు పర్యటన

ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 27న తమిళనాడు పర్యటనకు వెళ్ళనున్నారు.

12.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది సి గురువారం శ్రీవారి టోకెన్ లేని భక్తుల సందర్శనానికి 8 గంటల సమయం పడుతుంది.

13.భారత్ లో ప్రాక్టీస్ కు విదేశీ లాయర్లకు అనుమతి

విదేశీ చట్టాలు అంతర్జాతీయ చట్టపరమైన అంశాలు మధ్యవర్తిత్వ అంశాల్లో విదేశీ లాయర్లు,  లా సంస్థలను దేశంలో ప్రాక్టీస్ కు అనుమతించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.

14.భారత్ గౌరవ రైలులో శ్రీరామాయణ యాత్ర

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

భారత్ గౌరవ డీలక్స్ ఏసీ పర్యాటక రైలు ద్వారా 18 రోజుల శ్రీరామాయణ యాత్రను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

15.భారత్ లో కొత్త వేరియంట్

భారత్ లో కోవిడ్ కేసులు పెరగడానికి వేగంగా వ్యాప్తి చెందుతున్న ఎక్స్ బిబి n.1 ఉప వేరియంట్ ఎక్స్ బీబీ 1.16 కారణం కావచ్చని సార్స్ కొవ్ 2 లపై అధ్యయనం చేస్తున్న అంతర్జాతీయ భారతీయ శాస్త్రవేత్తలు తెలిపారు.

16.మనీష్ సిసోడియాపై సిబిఐ కొత్త కేసు

Advertisement

ఢిల్లీ మాజీ ఉప ముఖ్య మంత్రి మనీష్ సిసోడియాపై మరో కేసు నమోదు అయింది.ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ లో అవకతవకులు జరిగాయని ఆరోపణలపై సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసింది.

17.  సిఆర్పిఎఫ్ లో ఉద్యోగలకు నోటిఫికేషన్

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్ పీ ఎఫ్) లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది.

18.పురుషులకు జాతీయ కమిషన్ కావాలి

పెళ్లయిన మగవారు గృహంస కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని , అటువంటి వారి రక్షణకు మహిళా కమిషన్ మాదిరిగా జాతీయ పురుష కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

19.ఇంటికే భద్రాద్రి సీతారాముల కళ్యాణ తలంబ్రాలు

శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తులకు అందించాలని ఆర్టీసే నిర్ణయించింది.తలంబ్రాలు కావలసనవారు కార్గో పార్సిల్ కేంద్రాల్లో 116 చెల్లించి వివరాలను నమోదు చేసుకోవాలని సంస్థ ఎం డి సజ్జనార్ సూచించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 53,550 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 58,420.

తాజా వార్తలు