న్యూస్ రౌండప్ టాప్ 20

1.గుజరాత్ లో భూకంపం

గుజరాత్ లో భూకంపం సంబంధించింది.

కచ్ జిల్లాలోని బచౌక కు ఐదు కిలోమీటర్లు దూరంలో భూమి కనిపించింది.రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.5 గా నమోదయింది.

2.సొంత మల్టీప్లెక్స్ ప్రారంభించిన బన్నీ

గతంలో అమీర్ పేట్ సెంటర్ లోని సత్యం థియేటర్ పాడుకోవడంతో దాని తొలగించి అదే స్థానంలో ఏషియన్ సత్యం మాల్ ను నిర్మించారు.

దీనిలో అల్లు అర్జున్, ఏషియన్ సునీల్ తో పాటు సదానంద గౌడ్,  మురళీమోహన్ భాగస్వాములుగా ఉన్నారు .ఈ మల్టీప్లెక్స్ ను ఈ రోజు అల్లు అర్జున్ ప్రారంభించారు.

3.సిద్దిపేటలో ఐటీ హబ్ ప్రారంభం

సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు కేటీఆర్ పర్యటించారు.ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రం సమీపంలోని నాగుల బండలో 63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ ను మంత్రి హరీష్ రావు తో కలిపి కేటీఆర్ ప్రారంభించారు.

4.ఒకేసారి 100 జియో టవర్లు ప్రారంభం

ఒకేసారి 100 జియో టవర్లను ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.

5.తీరం దాటనున్న బిపర్ జోయ్ తుఫాన్

Advertisement

బిపర్ జొయ్ తుఫాను తీరం దాటనున్న నేపథ్యంలో ఐఎండి హెచ్చరికలు చేసింది.

6.యువజన క్రీడా వ్యవహారాలపై జగన్ సమీక్ష

యువజన క్రీడా వ్యవహారాలపై ఈరోజు ఉదయం 11:30 నిమిషాలకు క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

7.గజ్వేల్ నియోజకవర్గంలో 20 దేశాల ప్రతినిధుల పర్యటన

నేడు గజ్వేల్ నియోజకవర్గంలో 20 దేశాల ప్రతినిధులు పర్యటిస్తున్నారు.కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ఈ బృందం సందర్శించనుంది.

8.మెదక్ జిల్లాలో సిఎస్ పర్యటన రద్దు

మెదక్ జిల్లాలో తెలంగాణ సిఎస్ శాంతి కుమారి పర్యటన రద్దయింది.

9.నేడు లా సెట్ ఫలితాలు

ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు లా సెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.

10.బెజవాడలో రౌండ్ టేబుల్ సమావేశం

పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో నేడు బెజవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

11.గిరిజనులతో సీఎం జగన్

పాడేరు నియోజకవర్గం సంబంధించి జి మాడుగుల మండలం సుబ్బుల గ్రామంలో అరకు నియోజకవర్గం సంబంధించిన హంకుంపేట మండలం భీమవరం గ్రామంలో గిరిజనులతో పర్చువల్ గా సీఎం జగన్ మాట్లాడనున్నారు.

12.జగన్ పై దాడి కేసు

వైయస్ జగన్ పై దాడి కేసులో నేడు ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది.

13.ముందస్తు ఎన్నికలపై పవన్ కామెంట్స్

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024
రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

నవంబర్ లేదా డిసెంబర్ లో ఏపీలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

14.హైదరాబాదులో జి20 సదస్సు

హైదరాబాదులో నేటి నుంచి 20 సదస్సు జరగనుంది.ఈ సదస్సుకు 30 దేశాల వ్యవసాయ మంత్రులు హాజరుకానున్నారు.

15.నాగపూర్ లో బీఆర్ఎస్ కార్యాలయం

Advertisement

 మహారాష్ట్రలోని నాగపూర్ లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

16.కొనసాగుతున్న ఐటీ దాడులు

బీ ఆర్ ఎస్ కు చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధుల ఇళ్ళల్లో ఐటి అధికారులు నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.భువనగిరి ఎమ్మెల్యే పైడ్ల శేఖర్ రెడ్డి ,నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో రెండో రోజు ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

17.జగన్ ప్రభుత్వం పై సిపిఐ విమర్శలు

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను జగన్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.

18.  సిబిఐ కు లేఖ రాసిన కోడి కత్తి శీను

ఎన్ఐఏ కోర్టులో నేడు కోడి కత్తి కేసు విచారణ జరిగింది.

ఈ సందర్భంగా కోర్టుకు కోడి కత్తి శ్రీను,  ఇరుపక్షాల న్యాయవాదులు హాజరయ్యారు.తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోడి కత్తి కేసులు నిందితుడు జున్నుపల్లి శ్రీనివాస్ లేఖ రాశారు.

19.చెప్పులు చూపించిన పేర్ని నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి  నాని విమర్శలు చేశారు.పవన్ చేస్తున్నది వారాహి యాత్ర కాదని , నారాహి యాత్ర అని విమర్శించారు.పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చెప్పులు చూపిస్తూ నాని విమర్శలు చేశారు.

20.నారా లోకేష్ విమర్శలు

మాట మార్చుడు , మడమతిప్పుడు లో సీఎం జగన్ కరకట్ట కమల్ హాసన్ ను మించిపోయాడని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు.

21.మహారాష్ట్రలో తెలంగాణ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం

మహారాష్ట్రలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది.

ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి పశువు అడ్డు రావడంతో దానిని తప్పించబోయి ఎమ్మెల్యే జోగు రామన్న వాహనం డివైడర్ ను ఢీకొట్టింది.ఈ ప్రమాద సమయంలో జోగు రామన్న తో పాటు కోనప్ప ,మాజీ ఎంపీ నగేష్ ఉన్నారు.

22.బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 54,700 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 59,670.

తాజా వార్తలు