న్యూస్ రౌండప్ టాప్ 20

1.రైతాంగ సమస్యలపై బిజెపి ఆందోళన

రైతాంగ సమస్యలపై భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. 

2.గుజరాత్ సీఎం గా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం

  గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. 

3.ఎమ్మెల్సీ అనంత బాబుకు ఊరట

 

వైసిపి ఎమ్మెల్సీ అనంత బాబుకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

4.రేవంత్ రెడ్డి కామెంట్స్

   అర చేతిలో వైకుంఠం చూపించడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరితేరిపోయారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. 

5.సజ్జలపై అయ్యన్న కామెంట్స్

 

తెలుగు రాష్ట్రాల కలయిక అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుర్ర ఉండే మాట్లాడుతున్నారా అని టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. 

6.పార్టీ మార్పు అంశంపై స్పందించిన గంటా శ్రీనివాసరావు

  తాను ప్రస్తుతం పార్టీ మారడం లేదని ఒకవేళ మారితే అందరికీ చెప్పే మారుతానని టిడిపి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. 

7.తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ కు బ్రేక్

 

Advertisement

తెలంగాణలో గిరిజన రిజర్వేషన్ పెంపుకు బ్రేక్ పడింది.సుప్రీం కోర్టులో ఈ కేసు పరిష్కారమైన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. 

8.కేసిఆర్ కుటుంబం జైలుకి వెళ్లాల్సిందే

  కేసిఆర్ కుటుంబం అంతా త్వరలో జైలుకు క్యూ కట్టాల్సిందేనని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. 

9.పిసిసి మాజీ సభ్యుడి మృతి

 

పిసిసి మాజీ సభ్యుడు గానుగుల వీర నేతాజీ (72) గుడివాడ లో మృతి చెందారు. 

10.డిజిపి ఆఫీస్ ముట్టడికి ప్రయత్నం.విద్యార్థి సంఘాల నేతల అరెస్ట్

  విజయవాడలో డిజిపి ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించిన వివిధ విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

11.నేడు ఢిల్లీకి కేసీఆర్ దంపతులు

 

బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ ఆయన సతీమణి ఈరోజు ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు. 

12.కెసిఆర్ పై మంత్రి కామెంట్స్

  కెసిఆర్ కనుక తెలంగాణ లేకపోయి ఉంటే పర్యావరణం దెబ్బతినేదని మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

13.బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాట్లు పరిశీలన

 

ఢిల్లీలో టిఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు పనులను మంత్రి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. 

14.కవిత పై సీబీఐ విచారణ కుట్ర

  టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై సిబిఐ విచారణ అంతా కుట్ర అని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. 

15.బీసీ గణన పై పార్లమెంట్ లో తీర్మానం చేయాలి

 

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
అమ్మాయి కనపడితే ముద్దయినా పెట్టాలి ?కడుపైనా చేయాలన్న బాలయ్య జైల్లో పెట్టారా : పోసాని

బీసీ గణనన, కులాల లెక్కింపు  పై పార్లమెంట్ లో తీర్మానం చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జుజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. 

16.తాండూరు బీఆర్ ఎస్ టికెట్ నాకే

  తాండూరు బి ఆర్ ఎస్  అభ్యర్థి తానేనని అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. 

17.తిరుమల సమాచారం

 

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.నిన్న తిరుమల శ్రీవారిని 72,466 మంది భక్తులు దర్శించుకున్నారు. 

18.పోలవరం కు ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదు

  పోలవరం టు ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది . 

19.ఆగ్రోస్ చైర్మన్ గా విజయ సింహ రెడ్డి

 

తెలంగాణ అగ్రోస్ సంస్థ చైర్మన్ గా తిప్పల విజయ సింహ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 49,800   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -54,330.

తాజా వార్తలు