న్యూస్ రౌండప్ టాప్ 20

1.బండి సంజయ్ అరెస్టుపై న్యాయపోరాటం చేస్తాం

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.

ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని , రాష్ట్రం మొత్తం బండి సంజయ్ కు అండగా ఉంటుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

2.ప్రీ మెడికల్ స్కాలర్షిప్ టెస్ట్ నోటిఫికేషన్

వైద్య విద్యను అభ్యసించే ప్రతిభవంతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన ఆల్ ఇండియా ఫ్రీ మెడికల్ స్కాలర్షిప్ టెస్ట్ 2023 నోటిఫికేషన్ విడుదలైంది.ఎంబిబిఎస్ సహా డెంటల్ , హోమియో, యునాని, ఆయుర్వేద విభాగాల్లో మెడికల్ డిగ్రీ కోర్సులు చేసే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

3.ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్  ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.హనుమాన్ శోభాయాత్రకు రాజాసింగ్ బయలుదేరి వెళుతుండగా,  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

4.అమరావతి రైతుల పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందన

అమరావతి రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయింపు పై స్థానిక రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, దీనిపై అత్యున్నత న్యాయస్థానం స్పందించింది.ఈరోజు కేసుల జాబితా తయారయిందని , ఏప్రిల్ 14న విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర చుడ్ స్పష్టం చేశారు.

5.నాదెండ్ల మనోహర్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు.గతంలో అసెంబ్లీ స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ సభను నడిపిన విదానాన్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు.

6.హైదరాబాద్ కు ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల 8న హైదరాబాద్ కు రానున్నారు.

7.ఎర్నాకులం వైజాగ్ స్పెషల్ ట్రైన్

ఈనెల 7వ తేదీన ఎర్నాకులం నుంచి విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైలు రైల్వే శాఖ నడుపుతుంది.

8.తిరుమల సమాచారం

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది .బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 19 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

9.హనుమాన్ శోభాయాత్ర

నేడు భాగ్యనగరంలో హనుమాన్ శోభా యాత్ర నిర్వహించారు .  ఉదయం 11:30 గంటలకు ఈ యాత్ర ప్రారంభమైంది.

10.పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ పై .

పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ కావడం వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నట్లు వస్తున్న వార్తల  పై సిపిఎం కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.దీనిపై సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

11.రఘునందన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి

డీజీపీ అంజనీ కుమార్ పై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్యలను ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.రఘునందన్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఐపీఎస్ అధికారుల సంఘం అసెంబ్లీ స్పీకర్ ను కోరారు.

12.బిజెపి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆందోళనలు, రాస్తారోకులు, దిష్టిబొమ్మ దహనాలు చోటుచేసుకున్నాయి.

13.జగన్ పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయని పాపం జగన్ దేనిని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

14.బండి సంజయ్ పిటిషన్  విచారణ వాయిదా

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.పదో తేదీ కి విచారణను వాయిదా వేశారు.

15.రాజాసింగ్ వార్నింగ్

నన్ను అరెస్ట్ చేస్తే హనుమాన్ భక్తులు విధ్వంసం సృష్టిస్తే దానికి నేను బాధ్యుడిని కాదు అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

16.రాంగోపాల్ వర్మ కామెంట్స్

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

రేపు నా పుట్టినరోజు అని , ఎవరు తనను విష్ చేయవద్దు అంటూ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

17.భారత లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 5,335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

18.కేంద్ర మంత్రి కామెంట్స్

Advertisement

బిజెపి పోరాటం చేసింది కాబట్టి తెలంగాణ వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

19.ఈటెల రాజేందర్ కు పోలీసుల నోటీసులు

పదో తరగతి పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

20.నేను పార్టీ మారడం లేదు : కోమటిరెడ్డి

తాను పార్టీ మారుతున్నానంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని , నాది కాంగ్రెస్ రక్తం అని , పార్టీ మార్పు వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు.

తాజా వార్తలు