న్యూస్ రౌండప్ టాప్ 20 

1.పంట నష్టం పరిహారంపై విమర్శలు

తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలు కారణంగా పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు ప్రభుత్వం పరిహారం అందించలేదని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar ) బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

2.ముందస్తు ఎన్నికలపై మంత్రి పెద్దిరెడ్డి క్లారిటీ

ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే ప్రచారంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో వైసిపి లేదని ఆయన అన్నారు.

3.భట్టి విక్రమార్క విమర్శలు

కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపడం నీవల్ల కాదు కదా మీ తాత వాళ్ళ కూడా కాదు అని సీఎల్పీ నేత మల్లు బట్టు విక్రమార్క అన్నారు.

4.హోం మంత్రిని కలిసిన రెజ్లర్లు

బిజెపి ఎంపీడబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిడ్జ్ భూషణ్ శరన్ సింగ్ కు వ్యతిరేకంగా రేజ్లెర్ లు నిరసనలు తెలుపుతున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యను ప్రస్తావించగా చట్టం ముందు అందరూ సమానమేనని, అమిత్ షా వారికి భరోసా ఇచ్చారు.

5.పెట్టుబడుల పై జగన్ సమీక్ష

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.

6.భారత్ భవన్ కు కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ లోని కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.

7.కెసిఆర్ పర్యటన

Advertisement

రేపు నాగర్ కర్నూలు జిల్లాలో సీఎం కేసీఆర్( Cm Kcr ) పర్యటించనున్నారు.

8.ఒడిసా రైలు ప్రమాద ఘటన

ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో అధికారులతో కలిసి ఒడిస్సాలో రైలు ప్రమాద ఘటన స్థలికి వెళ్లినట్లు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) తెలిపారు.రెండు రైళ్లలో ఏపీకి చెందిన 342 మందిని గుర్తించామని , 9 మందికి విశాఖలో చికిత్స జరుగుతోందని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు.

9.ఏపీ నెంబర్ వన్

కోడిగుడ్ల ఉత్పత్తిలో ఏపీ నంబర్ వన్ గా నిలిచినట్లు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శాఖ సర్వే 2022 ను వెల్లడించింది.

10.తిరుమల సమాచారం

 సామాన్య భక్తులకు( Devotees ) అసౌకర్యం కలగకుండా జూలై 15 వరకు శుక్ర , శని ఆదివారాల్లో విఐపి బ్రేక్  దర్శనాలను ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకే పరిమితం చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

11.  ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ

ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం నేడు అమరావతి సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లోని ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతున్నారు.

12.ఏపీ మంత్రి మండలి సమావేశం

ఈనెల 7వ తేదీన ఏపీ మంత్రి మండలి సమావేశం జరుగునుంది.క్యాబినెట్ లో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ కసరత్తు చేయనున్నారు.

13.గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై హై కోర్టు లో పిటిషన్

తెలంగాణ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇప్పటికే చాలా పేపర్లు లీక్ అయిన తరువాత కూడా, అదే సిబ్బందితో పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

14.ఐటీ శాఖ ప్రగతి నివేదిక విడుదల

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
వయనాడ్ ఎన్నికల బరిలోకి నవ్య హరిదాస్.. అసలు ఎవరు ఈమె..?

ఐటీ శాఖ ప్రగతి నివేదిక మంత్రి కేటీఆర్ విడుదల చేశారు.

15.వైసీపీ ప్రభుత్వం పై ఆనం విమర్శలు

వైసీపీ పాలనలో న్యాయం జరగదని టిడిపి అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు .తనపై హత్యాయత్నం జరిగితే ట్రెస్ పాస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారని ఆనం మండిపడ్డారు.

16.భాస్కర్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై సీబీఐ కోర్టు లో విచారణ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది.బెయిల్ మంజూరు చేయాలని భాస్కర రెడ్డి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

17.చంద్రబాబు ఢిల్లీ టూర్ పై అయ్యన్న కామెంట్స్

Advertisement

కేంద్ర మంత్రి అమిత్ షాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కలవడంపై ఆ పార్టీ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు.కారణం ఏదైనా ఉండవచ్చునని దుర్మార్గుడి పాలన పోవాలంటే అందరూ ఏకం అవ్వాలి అని గతంలోనే చెప్పినట్లు అయ్యన్న అన్నారు.

18.ఒడిశా రైలు ప్రమాదం పై జీవీ ఎల్ కామెంట్స్

ఒడిస్సా రైలు ప్రమాద ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయని బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.

19.ఒంగోలు లో తుపాకీ పేలుడు కలకలం

ఒంగోలు రాజాఫానగల్ లో తుపాకీ పేలుడు కలకలం రేపింది.

యూ బీ ఐ కరెన్సీ టేస్సి సెంటర్ లో ఎస్పీఎఫ్ గార్డు వెంకటేశ్వర్లు గన్ పేలింది.ఈ ఘటనలు గార్డు వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందారు.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 55,300

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 60,330

తాజా వార్తలు