భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ( Virat Kohli ) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నట్లు తెలుస్తుంది.తాజాగా జరిగిన ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్( WTC final ) లో భారత జట్టు విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.అంతేకాదు ఈ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ద్వారా కొందరి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకోవడం కోసం కోహ్లీ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూడా సమాచారం.
ఆ రికార్డులు ఏమిటో చూద్దాం.

సెహ్వాగ్ రికార్డు పై కన్ను
: సెహ్వాగ్ తన టెస్ట్ కెరీర్లో 8586 పరుగులు చేశాడు.విరాట్ కోహ్లీ 108 టెస్ట్ మ్యాచ్ లలో 8416 పరుగులు చేశాడు.సెహ్వాగ్ రికార్డ్ బద్దలు కొట్టాలంటే విరాట్ కోహ్లీ 171 పరుగులు చేయాల్సి ఉంది.
మామూలుగా అయితే ఈ రికార్డు క్రాస్ చేయడం కాస్త కష్టమే.కానీ కోహ్లీ ఫామ్ చూస్తుంటే కచ్చితంగా ఈ రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉంది.
ద్రావిడ్ రికార్డుపై కన్ను
: భారత జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కు ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లలో ఒకడిగా మంచి గుర్తింపు ఉంది.ద్రావిడ్ ఆస్ట్రేలియాపై 60 ఇన్నింగ్స్ లలో 13 అర్థ సెంచరీలు, రెండు సెంచరీలతో 2143 పరుగులు చేశాడు.

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై 42 ఇన్నింగ్స్ లలో 1979 పరుగులు చేసి, ఆస్ట్రేలియాపై ( Australia )అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.రాహుల్ ద్రావిడ్ రికార్డ్ క్రాస్ చేయాలంటే విరాట్ కోహ్లీ ఇంకా 164 పరుగులు చేయాల్సి ఉంది.ఈ మ్యాచ్ తో రికార్డ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది.
రీకి పాంటింగ్ రికార్డ్ పై కన్ను
: భారత్- ఆస్ట్రేలియా సిరీస్ లలో అత్యధిక సెంచరీలు బాదిన ప్లేయర్ల జాబితాలో 11 సెంచరీలతో సచిన్ టెండుల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.ఇక 8 సెంచరీలతో రికీ పాంటింగ్, విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ రెండవ స్థానంలో ఉన్నారు.ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్ లలో ఎవరు సెంచరీ చేసిన రికీ పాంటింగ్ రికార్డ్ బ్రేక్ అయినట్టే.