న్యూస్  రౌండప్ టాప్ 20 

1.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 19,893 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

2.సంజయ్ రౌత్ ఈడి కస్టడీ పొడగింపు

పాత్రా చాల్ కుంభకోణానికి సంబంధించిన కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ను  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీని పొడిగిస్తూ ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

3.కస్తూర్బా పాఠశాలలో కరోనా కలకలం

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం లోని నేరేడు గుమ్ము కస్తూరిబా గాంధీ పాఠశాలలో 17 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది.

4.కొవిడ్ టీకా పై రాందేవ్ బాబా కామెంట్స్

కోవిడ్ వ్యాక్సిన్ ను వైద్య శాస్త్ర వైఫల్యంగా యోగ గురువు బాబా రాందేవ్ అభివర్ణించారు.

5.కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన కేసీఆర్

అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం తో నిర్మించిన పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది.

6.నేటితో ముగియనున్న బిజెపి పాదయాత్ర

Advertisement

మనం మన అమరావతి పేరుతో ఏపీ బిజెపి తలపెట్టిన పాదయాత్ర నేటితో ముగియనుంది.

7.ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సిబిఐ దర్యాప్తు చేయాలి

ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి కోరారు.

8.నాదెండ్ల మనోహర్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వం ఎస్ డి సి ద్వారా తెచ్చిన ఆరు వేల కోట్లు దారి మళ్ళించారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

9.కేటీఆర్ కామెంట్స్

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఒక అద్భుతం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు.

10.రేపు కాంగ్రెస్ బహిరంగ సభ

మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తుంది.రేపు సాయంత్రం నాలుగు గంటలకు చుండూరులోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో సభ నిర్వహించనున్నారు.

11.పార్టీ మార్పుపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్స్

కాంగ్రెస్ ను వీడుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.తాను పార్టీ మారేదే లేదని క్లారిటీ ఇచ్చారు.

12.బండి సంజయ్ కామెంట్స్

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తెలంగాణలో మరిన్ని ఉప ఎన్నికలు రానున్నయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.

13.కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు

రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు వదల కారణంగా దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు గేట్లకు అత్యవసరంగా మరమ్మతులు చేస్తున్నారు.

14.తెలంగాణకు నేడు రేపు భారీ వర్ష సూచన

Advertisement

నేడు రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

15.వచ్చే నెల 26 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

16.ఆర్ఆర్ఆర్ భూసేకరణకు నోటీసులు

హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణ ప్రాంతాలకు అనుసంధానం చేసే రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ ఆర్ ఆర్ ) ఉత్తర భాగంలో భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు నోటీసులు పంపిస్తున్నారు.

17.జీవన్ రెడ్డి హత్య కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం

నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కొట్ర కేసులు పోలీసులు ముమ్మరం చేశారు.ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దగాని ప్రసాద్ గౌడ్ ను ఏ 1 గానూ,  ఆయన భార్య మాజీ సర్పంచ్ లావణ్యను ఏ 2 గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

18.తెలంగాణలో కొత్తగా మరో ఎనిమిది వైద్య విద్య కళాశాలలకు ఈనెల 8 లేదా 9 తేదీల్లో దరఖాస్తు చేయనున్నట్లు వైద్య వైద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి తెలిపారు.

19.అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ కోర్స్ ప్రవేశ గడువు పొడగింపు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం డిగ్రీ పీజీ పీజీ డిప్లమో కోర్సులు ఈనెల 16 వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,500

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 51,820

తాజా వార్తలు