న్యూస్ రౌండప్ టాప్ 20

1.చంద్రబాబు కేసు.

  రఘురామ కామెంట్స్

ఫైబర్ నెట్  కేసు పై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కామెంట్ చేశారు.ఇది సీఎం జగన్ వ్యక్తిగత కక్ష మాత్రమే తప్ప కేసులో ఏమీ లేదని ఎంపీ రఘురాం కృష్ణంరాజు అన్నారు.

2.ఐఏఎస్ శ్రీ లక్ష్మి పై అమరావతి రైతుల ఫిర్యాదు

ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై అమరావతి రైతులు తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

3.ఒకే దేశం ఒకే ఎన్నికపై సమావేశం

 ఒకే దేశం ఒకే ఎన్నికలు విధివిధానాలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తదుపరి సమావేశం ఈనెల 25న జరగనుంది.

4.ఏపీ హేట్స్ జగన్ పుస్తకావిష్కరణ

ఏపీ హేట్స్  జగన్ పుస్తక ఆవిష్కరణ జరిగింది.ఈ పుస్తకాన్ని ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విడుదల చేశారు.

5.రాహుల్ గాంధీ కామెంట్స్

దొరల తెలంగాణ కు .ప్రజా తెలంగాణ కు మధ్య జరుగుతున్న ఎన్నికలని, తెలంగాణ వచ్చినా  ప్రజల ఆకాంక్ష నెరవేరలేదని, తెలంగాణ లో రాచరిక పాలన సాగుతోందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు.

6.జగన్ ను కలిసిన ఏషియన్ గేమ్స్ మెడల్ విన్నర్స్

ఏపీ సీఎం జగన్ ఏషియన్ గేమ్స్ మెడల్ విన్నర్స్ ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కలిశారు.

7.ఫైబర్ నెట్ కేసు

Advertisement

ఫైబర్ నెట్ కేసులో టీడీపి అధినేత చంద్రబాబుపై సిఐడి వేసిన పిటి వారెంట్ పై విజయవాడ ఏసిబి కోర్టులో ఈరోజు విచారణ జరిగింది.సిఐడి తరఫున న్యాయవాదులు కోర్టులో విచారణ జరిగింది.

8.ప్రకాశం ఎస్పీ కి సీఏం వో పిలుపు

ప్రకాశం జిల్లా ఒంగోలు లో భూ కుంభకోణం సంచలనంగా మారిన నేపథ్యంలో , జిల్లా ఎస్పీ మాలికా గార్గ్ కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది.

9.బీ ఆర్ ఎస్ పియిషన్ కొట్టివేత

కారు ను పోలిన గుర్తులు రద్దు చేయాలంటూ బీ ఆర్ ఎస్ దాఖలు చేసిన పిటిషన్ లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

10.బీఆర్ఎస్ లోకి అంబర్పేట శంకర్

అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో అంబర్ పేట శంకరన్న చేరారు.

11.కేటీఆర్ కామెంట్స్

తెలంగాణ ఉద్యమం లేకుంటే రేవంత్ రెడ్డి,  కిషన్ రెడ్డికి ఆ పదవులు ఉండేవా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు

12.లాయర్ల ఫీజుపై లక్ష్మీపార్వతి కామెంట్స్

లాయర్లకు వేలకోట్ల ఫీజులు చెల్లించడానికి టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని వైసీపీ నేత లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

13.కౌంటింగ్ కేంద్రాల పరిశీలన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదించిన కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

14.జగిత్యాలకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లాకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు.

15.హనుమంత వాహనంపై శ్రీవారు

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

తిరుమలలో ఆరో రోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.ఈరోజు హనుమంత వాహనంపై శ్రీవారు దర్శనం ఇచ్చారు.

16.తిరుమల సమాచారం

తిరుమలలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

17.బంగాళాఖాతంలో వాయుగుండం

Advertisement

మరో మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడునుంది.  ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశలో పయనిస్తూ సోమవారం వాయుగుండం గా బలపడే సూచనలు ఉన్నాయి.

18.కాంగ్రెస్ అభ్యర్థిని మార్చాలంటూ ధర్నా

గోసమహల్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి సునితారావును వెంటనే మార్చి స్థానికులకు టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ధర్నా చేపట్టారు.

19.గజ్వేల్ బి ఆర్ ఎస్ నాయకులతో కేసీఆర్ భేటీ

గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం కేసీఆర్ ఈరోజు సమావేశం అయ్యారు.

20.రాహుల్ గాంధీ తో కోదండరాం భేటీ

రాహుల్ గాంధీ తో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు.

తాజా వార్తలు