న్యూస్ రౌండప్ టాప్ 20 

1.చేప మందు ప్రసాదం పంపిణీకి బ్రేక్

ఈ ఏడాది చేపమందు పంపిణీ కి బ్రేక్ పడింది కరోనా , లాక్ డౌన్ తదితర కారణాలతో ఈ చేప మందు పంపిణీ ని నిలిపివేస్తున్నట్లు బత్తిన హరినాథ్ గౌడ్ తెలిపారు.

2.ముక్కు నేలకు రాస్తా అంటూ ఈటెల సతీమణి సంచలన వ్యాఖ్యలు

తాము నలభై ఆరు ఎకరాలు కొనుగోలు చేశామని, బడుగు బలహీనవర్గాల భూములను తాము కాజేశాము అని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా అంటూ ఈటెల సతీమణి జమున సవాల్ చేశారు.

3.యాచకులకు కరోనా పరీక్షలు

హైదరాబాదులో యాచకులకు కరోనా పరీక్షలు చేయించి వారిని వృద్ధాశ్రమాలకు తరలించారు.రంగారెడ్డి జిల్లా సాధికారిక సంస్థ కార్యదర్శి,  సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

4.ఖమ్మంలో 10 ఆసుపత్రులకు కొవిడ్ అనుమతులు రద్దు

ఖమ్మంలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిన 10 ఆసుపత్రులపై అధికారులు కఠిన చర్యలకు దిగారు.నిబంధనలు ఉల్లంఘించిన 10 ఆసుపత్రులకు కొవిడ్ వైద్య సేవలు అందించే అవకాశాన్ని రద్దు చేశారు.

5.తెలంగాణ కేబినెట్ భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది.

6.ఎంసెట్ వాయిదా

ఎంసెట్ ను వాయిదా వేయాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.

7.గురుకులాల్లో ఐదో తరగతి ఎంట్రన్స్ వాయిదా

వెనుకబడిన సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశాలకు నేడు జరగనున్న పీజీ సెట్ ప్రవేశ పరీక్ష వాయిదా పడింది.

8.నిట్ పీహెచ్డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ,( నిట్) లో పీహెచ్ డి పార్ట్ టైం, ఫుల్ టైం కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ సూర్యప్రకాష్ రావు తెలిపారు.

9.అటవీ సిబ్బందికి టెలిమెడిసిన్

మారుమూల అటవీ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అటవీశాఖ సిబ్బంది వారి కుటుంబాలకు టెలిమెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ తెలిపారు.

10.నిమ్స్ కు 10 వెంటిలేటర్లు

కార్పొరేట్ రెస్పాన్సిబులిటీ ఫండ్ కింద నిమ్స్ ఆస్పత్రికి 10 వెంటిలేటర్లు అందించాలని ట్రాన్స్ కో నిర్ణయించింది.

11.24 రైళ్లు రద్దు

Advertisement

ప్రయాణికుల కొరత కారణంగా వచ్చే నెల జూన్ నుంచి 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

12.రెండేళ్ల పాలన పై పుస్తకం ఆవిష్కరించిన జగన్

తన రెండేళ్ల పరిపాలన పై ఏపీ సీఎం జగన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

13.ఆనందయ్య నిర్బంధం తగదు

కరోనాకు మందు తయారు చేసిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం కు చెందిన ఆనందం నిర్బంధించడం తగదని సిపిఐ నేత నారాయణ అన్నారు.

14.ఏపీకి చేరుకున్న కోవిడ్ డోసులు

పూణే సీరం ఇన్స్టిట్యూట్ నుంచి లక్ష ఎనిమిది వేల డోసులు ఏపీకి చేరుకున్నాయి.

15.కోదండరామ్ మౌనదీక్ష

కరుణ సంక్షోభ సమయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మౌన దీక్షకు దిగారు.

16.తిరుమల సమాచారం

కరోనా ప్రభావం తో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుతూ వస్తోంది.శనివారం స్వామివారిని 13,450 మంది భక్తులు దర్శించుకున్నారు.

17.ఆన్ లైన్ లో గీతం వార్షిక పరీక్షలు

కరోనా నేపథ్యంలో ప్రాక్టికల్స్ తో సహా అన్ని వార్షిక పరీక్షలను జూన్ లో ఆన్లైన్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గీతం యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

18.సీఎం రిలీఫ్ ఫండ్ కు 186 కోట్లు

తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు 186 కోట్లు వచ్చాయి వీటిని కరోనా రోగులకు అవసరమైన సౌకర్యాలకు వినియోగించనున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.

19.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,65,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 45,810 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -49,960 .

పుష్ప 2 లో శ్రీ వల్లి ని చంపేది ఎవరో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు