న్యూస్ రౌండప్ టాప్ 20

1.ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో 1209 పంచాయతీలు గెలుచుకుని, 27 శాతం ఓటింగ్ సాధించామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

2.స్కూళ్లకు సెలవులు పై మంత్రి  రెస్పాన్స్

మార్చి ఒకటో తేదీ నుంచి మే 4 వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు అంటూ వస్తున్న ప్రచారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు.ఈ ప్రచారంలో వాస్తవం లేదని, యధావిధిగా పాఠశాలలు పని చేస్తాయని ఆయన ప్రకటించారు.

3.తెలంగాణకు కేంద్ర మంత్రి ప్రకాష్ జావడేకర్

కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ రోజు హైదరాబాద్ లో పర్యటించనున్నారు.సాయంత్రం ఐదు గంటలకు హోటల్ మారియట్ లో గ్రాడ్యుయేట్స్ తో ప్రకాష్ జవదేకర్ , తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశం కాబోతున్నారు.

4.జెసి ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమే కాకుండా వోటర్లను ప్రలోభాలకు గురి చేశారన్న ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు.

5.నైట్ కర్ఫ్యూ 15 రోజులు పొడిగింపు

గుజరాత్ రాష్ట్రంలో నాలుగు ప్రధాన నగరాల్లో  కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను మరో 15 రోజుల పాటు పొడిగిస్తూ, ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

6.కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు బ్రేక్

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా కేంద్ర కొనసాగిస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కు చిన్నపాటి విరామం ఇచ్చారు.ఈ నెల 27 28 తేదీల్లో రెండు రోజుల పాటు వ్యాక్సినేషన్ సెషన్ లు ఉండడం లేదని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.

7.టీటీడీ పాలక మండలి భేటీ

నేడు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి భేటీ కానుంది.ఈ భేటీలో సుమారు 80 అంశాలపై చర్చించబోతున్నారు.

8.భారత్ లో కరోనా

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 16,488 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

9.తెలంగాణలో కరోనా

Advertisement

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి

10.రసాయన ఎరువులతో అనారోగ్యం

సేంద్రీయ వ్యవసాయంతో ఆరోగ్యవంతమైన దేశం కోసం కృషి చేయాలని, ప్రమాదకరమైన రసాయన ఎరువులతో  అనారోగ్యం కొని తెచ్చుకోవద్దని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో అన్నారు.

11.పులి దాదుల్లో రెండు పశువుల మృతి

తెలంగాణలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పెద్దపల్లి సమీపంలో పశువుల మంద పై పులి దాడి చేయడంతో రెండు పోస్టులు మృతిచెందాయి.

12.తెలంగాణ లో కరోనా వ్యాక్సిన్

మార్చి ఒకటో తేదీ నుంచి తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

13.అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేదం పొడిగింపు

కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు పై ఉన్న నిషేధాన్ని తాజాగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరోసారి పొడిగించింది.అంతర్జాతీయ విమానాల రాకపోకల పై మార్చి 31 వరకు నిషేధాన్ని కొనసాగిస్తూ డి జి సి ఎ నిర్ణయం తీసుకుంది.

14.మహారాష్ట్ర లో కరోనా విజృంభణ

మహారాష్ట్రలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది.గడచిన 24 గంటల్లో కొత్తగా 8333 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.

15.పశ్చిమ బెంగాల్ లో బీజేపీ ఆఫీస్ కూల్చివేత

పశ్చిమ బెంగాల్ లో బిజెపి తృణముల్ కాంగ్రెస్ మధ్య వివాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.తాజాగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బీజేపీ ఆఫీస్ పై కొంతమంది వ్యక్తులు దాడిచేసి బిజెపి ఆఫీస్ ను కుల్చివేయడం ఉద్రిక్తతలకు దారి తీసింది.

16.కొత్త ఇల్లు కొనుగోలు చేసిన బాలయ్య

సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 15 లక్షలతో కొత్త ఇల్లు ను బంజారాహిల్స్ లో కొనుగోలు చేశారు.

17.బీజేపీ నేతలకు బండి సంజయ్ క్లాస్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలలో గెలిచి చేరాలనే పట్టుదలతో ఉన్న బిజెపి పార్టీ లో నెలకొన్న పరిస్థితుల పై దృష్టి పెట్టింది భాగంగానే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆ నియోజక వర్గంలో కీలక నాయకులు అందరికీ గట్టిగా క్లాస్ పీకారు.

18.టీడీపీలోనే ఉంటా : టి జి భరత్

తాను పార్టీ మారే అవకాశమే లేదని తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు టిజీ భరత్ ప్రకటించారు.

19.కేటిఆర్ పిఎ పేరుతో డబ్బులు డిమాండ్

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా.. : జగ్గారెడ్డి

అంతర్జాతీయ క్రికెట్ టీం నాగరాజు అని రంజిత్ ప్లేయర్ అయ్యాడని, ఆయన క్రికెట్ కొనుగోలుకు కొంత డబ్బు స్పాన్సర్ చేయాలని మంత్రి కేటీఆర్ పిఎ తిరుపతి రెడ్డి పేరుతో ఓ వ్యక్తి విష్ణు కెమికల్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రెటరీ కి ఫోన్ కాల్ చేసిన సంఘటనపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 42,700 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,580.

Advertisement

తాజా వార్తలు