న్యూస్ రౌండప్ టాప్ 20

1.  కాంట్రాక్టర్ల సమావేశం

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్ల ప్రారంభమైంది .కాంట్రాక్టర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై, ప్రభుత్వం నుంచి రావలసిన పెండింగ్ నిధులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.

2.కాంగ్రెస్ మైనారిటీ సెల్ ధర్నా

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత రావు తదితరుల ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ మైనార్టీ సెల్ ధర్మ కార్యక్రమం మొదలైంది దీనికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి , ఉత్తంకుమార్ రెడ్డి తదితరులు హాజరు కాబోతున్నారు.మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

3.ఇండియాకు తాలిబన్ల హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా తన సైనికులను మోహరించిన పక్షంలో అది ఇండియాకు మంచిది కాదని తాలిబన్ల అధికార ప్రతినిధి మొహమ్మద్ సూహైల్ సాహిల్ హెచ్చరించారు .

4.ఆగస్టు చివరి వరకు ఆన్లైన్ తరగతులు

తెలంగాణలో ఆగస్టు నెల ఆఖరు వరకు ఆన్లైన్ లోనే తరగతులు కొనసాగనున్నాయి.ఈ మేరకు శుక్రవారం విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం షెడ్యూల్ ప్రకటించారు.

5.మోడల్ స్కూళ్ల లో అడ్మిషన్లకు 21 పరీక్ష

తెలంగాణలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షను ఈనెల 21న నిర్వహించనున్నారు.

6.పిసిసి కార్యవర్గ సమావేశం

తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం ఈ రోజు నిర్వహించనున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా అభ్యర్థి ఎంపికపై చర్చించబోతున్నారు.

7.తిరుమల సమాచారం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.శుక్రవారం తిరుమల శ్రీవారిని 21,446 మంది భక్తులు దర్శించుకున్నారు.

8.సెప్టెంబర్ 25న ఎల్పీ సెట్

లాంగ్వేజ్ పండిట్ కాలేజీల్లో 2021- 22 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం సెప్టెంబర్ 25 ఎల్పీసెట్ నిర్వహించనున్నారు.

9.జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

 అక్రమాస్తుల కేసుకు సంబంధించి పెన్నా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైయస్ జగన్ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ లో కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రత్యేక కోర్టును సీబీఐ గడువు కోరింది దీనికి అనుమతిస్తూ విచారణను ఈనెల 20 కి వాయిదా వేశారు.

10.కృష్ణా నది లో చిక్కుకున్న వంద లారీ లు

కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది.దీంతో ఇసుక లోడింగ్ కోసం వచ్చిన దాదాపు వందకుపైగా లారీలు నదిలోనే చిక్కుకుపోయాయి.

11.డీకేసీ తో మధుయాష్కీ భేటీ

ఏఐసీసీ పరిశీలకుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార సమితి అధ్యక్షుడు మధుయాష్కి గౌడ్ కె పిసిసి అధ్యక్షుడు డి కె శివ కుమార్ తో భేటీ అయ్యారు.అయితే ఈ భేటీ మర్యాదపూర్వకంగానే జరిగినట్లు మధుయాష్కి పేర్కొన్నారు.

12.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 38,667 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

13.పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు నీట్ కు స్వస్తి

ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్ కు స్వస్తి చెప్పాలని జాతీయ వైద్య కమిషన్ నిర్ణయించింది.ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తర్వాత ప్రత్యేకంగా నిర్వహించే నేషనల్ ఎగ్జిట్ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికన నీట్ పీజీ లోను ప్రవేశాలు నిర్వహించనుంది.

14.వివేకా హత్య కేసు

Advertisement

తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని వెంటనే తగిన భద్రత కల్పించాలని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కడప ఎస్పీ కార్యాలయంలో లేఖ అందజేశారు.

15.థర్డ్ వేవ్ పై కేంద్రం అలర్ట్

కరోనా డ్రైవ్ ఏ క్షణంలోనైనా ముంచుకొచ్చే ప్రమాదం ఉండడంతో కేంద్రం అప్రమత్తమైంది.ఈ మేరకు ముందస్తుగానే ఆసుపత్రులలో బెడ్స్ ఆక్సిజన్ వంటి సౌకర్యాలు ఏర్పాటు పై దృష్టి సారించింది.

16.నలుగురు తీవ్రవాదుల అరెస్ట్

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.ఢిల్లీలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.ఢిల్లీలోని ఓ ప్రాంతంలో నలుగురు తీవ్రవాదులను అరెస్ట్ చేసి వారి వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

17.ప్రతిపక్షాలతో సోనియా భేటీ

విపక్ష నేతలతో కాంగ్రెస్ నేత సోనియాగాంధీ ఈ నెల 20న భేటీకానున్నారు.

18.వార్డు వాలంటీర్ ఆత్మహత్య.

లేఖ కలకలం

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని నాలుగో సచివాలయం 9 వ వార్డులో వాలంటీర్ గా పనిచేస్తున్న మహేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నా చావుకు కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ ఉద్యోగం అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.

19.అద్భుత కళాఖండంగా యాదాద్రి

యాదాద్రి అద్భుత కళా ఖండం అని, తిరుపతి దేవాలయం స్థాయిలో యాదాద్రిలో అభివృద్ధి జరుగుతోందని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 44000 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -48,000 .

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు