న్యూస్ రౌండప్ టాప్ 20

1.36 వ రోజుకు చేరిన మహాపాదయాత్ర

మూడు రాజధానులు,  సీఆర్డీఏ రద్దు కు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్ర నేటికి 36 వ రోజుకు చేరుకుంది.

 

2.లోక్ సభ నుంచి టీఆర్ఎస్ వాకౌట్

  లోక్ సభలో కేంద్రం తీరుని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీ లు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు. 

3.దళిత బంధు పై కేసీఆర్ కామెంట్స్

  హుజురాబాద్ ఎన్నికల కోసమే కేసీఆర్ దళిత బండి పథకాన్ని కేసీఆర్ ప్రవేశ పెట్టారని, ఇప్పుడు ఆ పథకం ఏమయిపోయింది అంటూ కేంద్ర మంత్రి కిషన్ w రెడ్డి విమర్శించారు. 

4.బీజేపీ లో చేరిన విఠల్

  టీఎస్ పీఎస్సీ  మాజీ సభ్యుడు విఠల్ ఈ రోజు బీజేపీ లో చేరారు.ఢిల్లీ లో తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో ఆయన బీజేపీ లో చేరారు. 

5.జమున హెచ్చరీస్ భూములపై కలెక్టర్ ప్రకటన

  ఈటెల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హెచరీస్ భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నాయని మెదక్ జిల్లా కలెక్టర్ అనేక ఆధారాలతో వివరాలు ప్రకటించారు. 

6.కేసీఆర్ పై షర్మిల కామెంట్స్

Advertisement

  తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కామెంట్స్ చేశారు.బంగారు తెలంగాణ ను కేసీఆర్ చావుల తెలంగాణ గా చేశాడని విమర్శించారు. 

7.విజయ్ సేతుపతి పై పరువు నష్టం దావా

  తమిళ నటుడు విజయ్ సేతుపతి పై పరువు నష్టం దావా కేసు నమోదైంది.విజయ్ తాను ప్రశంసలు కురిపించారు తనపై దాడికి దిగారని దీని కారణంగా తాను చాలా నష్టపోయాను అని ఆ దావా లో సదరు వ్యక్తి పేర్కొన్నాడు. 

8.ధాన్యం సేకరణ పై జగన్ సమీక్ష

  సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జగన్ వ్యవసాయ శాఖ , ధాన్యం సేకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

9.బాబు కామెంట్స్ పై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన

   ఓటియేస్ పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు అర్థరహితమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. 

10.సరిహద్దుల్లో డ్రోన్ కలకలం

  పంజాబ్ లోని ఇండో - పాక్ సరిహద్దు వద్ద మరోసారి డ్రోన్ కలకలం సృష్టించింది.అమృత్ సర్ లోని ఆజ్ఞాలో ఆదివారం రాత్రి ఓ డ్రోన్ సంచరించడాన్ని మిలటరీ సిబ్బంది గుర్తించారు. 

11.తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల

  తిరుమల శ్రీవారి ఆస్తులపై తొలిసారిగా శ్వేత పత్రం విడుదలైంది. 

12.జర్మన్ సంస్థ తో 

తెలంగాణ ప్రభుత్వం ఎం వో యూ విడుదల చేసింది.ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 

13.భారత్ లో 21 కి చేరిన ఓమి క్రాన్ కేసులు

  భారత్ లో ఒమి క్రాన్ కేసుల సంఖ్య 21కి చేరింది. 

14.రేవంత్ రెడ్డి కామెంట్స్

  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ రైతు సమస్యలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయి అనివ్, టీఆర్ఎస్ ఎంపీ లు నిరసనల పేరుతో ఢిల్లీ లో ఫోటోలకు పోజు ఇస్తున్నా రు అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు  

15.కేసిఆర్ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలి

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

  తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు సమస్యలపై జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించాలని  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. 

16.నాగాలాండ్ ఘటనపై కోర్టు ఎంక్వయిరీ కి ఆర్మీ ఆదేశం

  నాగాలాండ్ లో తీవ్రవాదులు అనుకుని పౌరులపై భద్రత దళాలు కాల్పులు నేర్పిన సంఘటనపై కోర్టు విచారణకు భారత ఆర్మీ ఆదేశించింది. 

17.తెలంగాణ దేవాదాయ శాఖ అర్చక ఉద్యోగులకు పీఆర్సీ

  తెలంగాణ దేవాదాయ శాఖలో పని చేస్తూ గ్రౌండ్ ఇన్ ఎయిడ్ అర్చక ఉద్యోగులకు నూతన పి ఆర్ సి వర్తింపజేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

18.అధికారుల  తీరుకు నిరసనగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా

Advertisement

  అధికారుల తీరును నిరసిస్తూ స్టేషన్ ఘనపూర్  టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య  ధర్నా కు దిగారు. 

19.ఆసియాలో శక్తివంతమైన దేశంగా భారత్

  అసాయలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా భారత్ నాలుగో స్థానం పొందింది. 

20.ఈ రోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,760   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -48,830      .

తాజా వార్తలు