న్యూస్ రౌండప్ టాప్ 20

1.దిశా నిందితుల ఎన్ కౌంటర్ పై హైపవర్ కమిటీ విచారణ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై హైపవర్ కమిషన్ విచారణ నిర్వహిస్తోంది.

 

2.మలేషియాలో తెలంగాణ వాసి మృతి

  మలేషియా లు తెలుగు వ్యక్తి మృతి చెందారు.డ్రైనేజ్ క్లీన్ చేస్తుండగా ఊపిరి ఆడక మక్కం సాయులు అనే వ్యక్తి చనిపోయాడు.మృతుడు డు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. 

3.జగ్గారెడ్డి లేఖ

  తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. 

4.ఇందిరా శోభన్ అరెస్ట్

  కరీంనగర్ జిల్లా లోని ఇల్లందకుంట లో వైఎస్సార్ టిపి మాజీ నేత ఇందిరా శోభన్ ఉపాధి భరోసా యాత్ర ఉద్రిక్తతకు దారి తీయడంతో , ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. 

5 .దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక సర్వే

  హుజురాబాద్ లో దళిత బంధువు లబ్ధిదారుల ఎంపిక సర్వే జరగనుంది.ఈ మేరకు ప్రత్యేక బృందాలుగా అధికారులు బయలుదేరారు. 

6.నేటి నుంచి గురుకుల కాలేజీల్లో ప్రవేశాలు

Advertisement

  తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ ను శుక్రవారం నుంచి చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. 

7.ఎస్సీ నర్సింగ్ విద్యార్థులకు ఉచిత శిక్షణ

  షెడ్యూల్డ్ కులాలకు చెందిన నర్సింగ్ విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంది.

విదేశాలకు వెళ్లాలనుకునే నర్సింగ్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టం , ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ టెస్ట్ పరీక్షకు ఉచిత శిక్షణ అందిస్తోంది.మరిన్ని వివరాల కోసం 63091 64343 నంబర్ ను సంప్రదించాలన్నారు. 

8.11 జిల్లాల్లో ఈవెనింగ్ కళాశాలలు

  సంధ్య శక్తి పథకం లో భాగంగా కర్ణాటక లోని 11 జిల్లాల్లో సాయంకాలం కళాశాలను అధికారులు ప్రారంభించనున్నారు. 

9.విశాఖ పోర్టు కార్మికుల ఆందోళన

  విశాఖ పోర్టు చైర్మన్ కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం కార్మికులు ఆందోళనకు దిగారు.పోర్ట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ పోర్టు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. 

10.రేవంత్ రెడ్డికి మహేశ్వర్ రెడ్డి వార్నింగ్

  కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

11.జగన్ కు రామకృష్ణ లేఖ

  ఏపీ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.హంద్రీనీవా ప్రధాన కాలువలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వినియోగంలోకి రాలేదని, హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువులను నింపవచ్చును ఈ లేఖలో పేర్కొన్నారు. 

12.గోదావరి కృష్ణా బోర్డు ల భేటీ

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

  కృష్ణ గోదావరి పరిధిలోని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, రెండు తెలుగు రాష్ట్రాల విధులు, బాధ్యతలు తదితర అంశాలపై చర్చించేందుకు సెప్టెంబర్ 12 హైదరాబాద్ లో నిర్వహించనున్నారు. 

13.కాబూల్ విమానాశ్రయం పై దాడి .భారీగా మృతులు

  కాబుల్ విమానాశ్రయంపై జరిగిన జంట ఆత్మహత్య దాడుల్లో మృతుల సంఖ్య 103 కు చేరింది.ఈ దాడిలో 13 మంది అమెరికా సైనికులు మరణించగా 90 మంది ఆఫ్ఘనీయులు మరణించారు. 

14.తిరుమలలో సాంప్రదాయ భోజనం

Advertisement

  తిరుమల శ్రీవారి భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవన్ లో గురువారం ప్రారంభించారు. 

15.ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు

  రాబోయే 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తా లతోపాటు , రాయలసీమలో కొన్ని చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 

16. దేశ్ కే మెంటర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సోను సూద్

  బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమావేశమయ్యారు.ఢిల్లీ ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న  దేశ్ కే మెంటర్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సోను సూద్ ను నియమిస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. 

17.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 44,658 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

18.సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్

  సైబర్ క్రైమ్ బాధితుల్లో తెలంగాణ టాప్ లో నిలిచింది.సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితుల కోసం కేంద్రం సెంట్రల్ సైబర్ క్రైమ్ నెంబర్ 155260 ను అమల్లోకి తెచ్చింది. 

19.ఉప ఎన్నికలు వెంటనే నియమించాలి

  హుజూరాబాద్ ఉప ఎన్నికలను వెంటనే నిర్వహించాలని తెలంగాణ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ ను బిజెపి బృందం కోరింది. 

20.ఈరోజు బంగారం ధరలు

  22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 46,620   24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర - 47,620.

తాజా వార్తలు