న్యూస్ రౌండప్ టాప్ 20

1.సర్జికల్ స్ట్రైక్ పై కేంద్రమంత్రి కామెంట్స్

సర్జికల్ స్ట్రైక్ పై కేసీఆర్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

2.ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకొద్దు

నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని సీఎం మనకు వద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వైయస్ షర్మిల విమర్శించారు.

3.అస్సాం సీఎం పై హైదరాబాద్ లో కేసు

అస్సాం సీఎం హిమంత్ బిస్వా పై హైదరాబాద్ లో కేసు నమోదయ్యింది.కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అస్సాం సీఎం విమర్శలు చేయడం పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది.

4.టిఎస్ పీఎస్సి కార్యాలయం ముందు షర్మిల దీక్ష

తెలంగాణలో వెంటనే ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ టిఎస్పి కార్యాలయం ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల దీక్షకు దిగారు.

5.హజ్ యాత్ర దరఖాస్తుకు నేడు చివరి తేదీ

హజ్ యాత్రకు వెళ్లే వారు దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం వరకు అనుమతి ఉందని హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీ ఉల్లా అన్నారు.

6.25 నుంచి ఎగ్జిబిషన్ పునః ప్రారంభం

81వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనను ఈనెల 25 నుంచి ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు.

7.యార్లగడ్డ రాఘవేంద్రరావుకు ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు

Advertisement

సీనియర్ జర్నలిస్ట్, కవి, శ్రీ యార్లగడ్డ రాఘవేంద్ర రావు కు  ఉమ్మడిశెట్టి సత్య దేవి సాహితీ అవార్డు లభించింది.

8.ఇన్నోవేషన్ కు 25 వేల మంది దరఖాస్తు

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రకటించిన స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021 కి ఈసారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందాయి.

9.వెస్ట్ జోన్ ఐజీగా కమల్ హాసన్ రెడ్డి

వెస్ట్ జోన్ ఐజీగా వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారి వీబీ కమల్ హాసన్ రెడ్డి నియమితులయ్యారు.

10.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

11.కేసీఆర్ పై ఈటెల రాజేందర్ కామెంట్స్

ప్రధాని పదవికి కనీస గౌరవం ఇవ్వకుండా నరేంద్ర మోది పై తెలంగాణ సీఎం కేసీఆర్ నోరు పారేసుకోవడం సరికాదని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.

12.అర్బన్ అధారిటీ లకు కమిటీల ఏర్పాటు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన అర్బన్ అధారిటీ లకు కమిటీలు , దాని పరిధి లోని గ్రామాలను  ఎంపిక చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

13.చేనేత కళాకారులకు అవార్డులు

చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట చేనేత కళాకారులకు రాష్ట్రస్థాయి అవార్డు లను అందించాలని నిర్ణయించిందని చేనేత , జౌళి శాఖ ఏడి వెంకటేశం తెలిపారు.

14.ఏపీ డీజీపీ పై బదిలీ వేటు

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది.ఆయనను జి.ఎ.డి లో రిపోర్టు చేయాలని  ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

15.హంద్రీనీవా కాలువపై  పయ్యావుల కేశవ్ నిరసన

హంద్రీనీవా కాలువ పై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆందోళనకు దిగారు.రైతులతో కలిసి ఆయన ఈ ఆందోళన చేపట్టారు.

16.రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

ఏపీ లోని రైతుల ఖాతాల్లోకి ఇన్పుట్ సబ్సిడీ ని ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

17.జెన్ కో  ఉద్యోగులు సహాయ నిరాకరణ కార్యక్రమం వాయిదా

ఏపీ జెన్ కో ఉద్యోగుల సహాయ నిరాకరణ కార్యక్రమం వాయిదా పడింది.

18.ఏపీ డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి

Advertisement

ఏపీ డీజీపీగా కసిరెడ్డి రాజేందర్ రెడ్డి ని నిర్మించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

19.ఆఫ్ లైన్ లో టీటీడీ సర్వ దర్శనం టికెట్లు

నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్ లను ఆఫ్ లైన్ లో జారీ చేయనుంది.

20.ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 46,800 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,050.

తాజా వార్తలు